రేవంత్ కు ఫుల్ పవర్స్ ! ఆపేవారే లేరా ? 

తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ అధిష్టానం సీరియస్ గానే నిర్ణయాలు తీసుకుంటోంది.

తెలంగాణ కాంగ్రెస్ పేరు చెబితే గ్రూపు రాజకీయాలు ఒకప్పుడు గుర్తుకు వచ్చేవి.

అయితే ఈ మధ్యకాలంలో పెద్దగా ఆ గ్రూపులు కనిపించడం లేదు.పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదల తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో కనిపిస్తోంది.

దీనికి కర్ణాటక ఎన్నికల ఫలితాలు దోహదం చేశాయని చెప్పవచ్చు.అయినా ఇటీవల కొంతమంది నేరుగా కాకపోయినా, పరోక్షంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth reddy ) పైన సెటైర్లు వేస్తున్నారు.

ఇంకా ఎన్నికలు జరగకుండానే పార్టీ అధికారంలోకి రాకుండానే సీఎం కూర్చి విషయంలో పేచీలు నడుస్తున్నాయి.ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇటీవల అమెరికాలో సీఎం అభ్యర్థి విషయంలోనూ ,ఉచిత కరెంటు విషయంలోనూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దమారాన్ని రేపాయి.

Advertisement
Full Powers To Revanth! Is There No One To Stop, BJP, Congress, Telangana Congre

దీనిని అనుకూలంగా మార్చుకుని బిఆర్ఎస్( BRS party ) ధర్నాలు,  ఆందోళనలు చేపట్టింది .

Full Powers To Revanth Is There No One To Stop, Bjp, Congress, Telangana Congre

ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి,( Komatireddy Venkatreddy ) మల్లు బట్టు విక్రమార్క వంటి నేతలు పరోక్షంగా రేవంత్ రెడ్డి తీరును తప్పుపట్టారు మా ఆయన టిడిపి నుంచి వచ్చిన నేత అంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు అనుకూలంగా రేవంత్ పై వీరు కామెంట్స్ చేయడం కలకలం రేపింది.రేవంత్ రెడ్డి కారణంగా తెలంగాణ కాంగ్రెస్ కు నష్టం జరుగుతోందని ఫిర్యాదులు పార్టీ హై కమాండ్ కు వెళ్లాయి.ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హై కమాండ్ ప్రాధాన్యం తగ్గించబోతుందనే ప్రచారం ఉధృతమైన నేపథ్యంలో,  కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డికి మరిన్ని బాధ్యతలు అప్పగించి ఆయనను కీలకం చేసింది.

ఎన్నికల కమిటీకి చైర్మన్ గా రేవంత్ రెడ్డిని నియమించింది.ఈ నియామకంతో రేవంత్ రెడ్డి విషయంలో ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేసినా తాము పట్టించుకోమని తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడమే తమకు ముఖ్యమనే సంకేతాలను పంపించినట్లయ్యింది.

Full Powers To Revanth Is There No One To Stop, Bjp, Congress, Telangana Congre

 ఇప్పుడు మొత్తం ఎన్నికల బాధ్యతలను రేవంత్ ఆధ్వర్యంలోని కమిటీనే చూస్తోంది .దీంతో రేవంత్ విషయంలో సొంత పార్టీలోని నేతలు దూకుడుగా వెళ్లేందుకు,  ఫిర్యాదులు చేసేందుకు ఆయన పైన విమర్శలు చేసేందుకు అవకాశం లేకుండా పోతుంది .ఇప్పుడు ఆయన సూచనలతోనే , ఆయన చెప్పినట్లుగానే మిగతా నాయకులంతా నడుచుకోవాలనే సంకేతాలను కాంగ్రెస్ హై కమాండ్ పంపించడంతో,  ఇక రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ లో తిరుగులేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అధిష్టానం నుంచి ఈ స్థాయిలో సహకారం లభించడంతో రేవంత్ మరింత ఉత్సాహంగా బీఆర్ఎస్ బిజెపిలను ఎదుర్కునేందుకు సిద్ధమవుతున్నారు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు