బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ అరియానా.ఈమె గురించి, ఈమె చేసే అల్లర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
బిగ్ బాస్ షోతో ఎనలేని క్రేజ్ ను సంపాదించుకొని సెలబ్రిటీ హోదాను అందుకుంది.అంతేకాకుండా నాన్ స్టాప్ బిగ్బాస్ లో కూడా పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.
తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది అరియానా.ఎంతో మంది అభిమానులను సంపాందించుకుంది.
తన కెరీర్ ను మొదటగా యూట్యూబ్ లో యాంకర్ గా మొదలు పెట్టింది.నిజానికి తన కెరీర్ ఇక్కడి నుండే ప్రారంభమమైంది.
గతంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయగా.ఆమెపై వర్మ చేసిన బోల్డ్ కామెంట్లతో సెలబ్రిటీగా మారింది.
ఒక్క ఇంటర్వ్యూతో వర్మ చేతిలో చిక్కిన అరియానా బాగా హాట్ టాపిక్ గా మారి క్రేజ్ సంపాదించుకుంది.
దాంతో వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం అందుకుంది.
ఎంట్రీ తోనే బాగా వైలెంట్ గా నిలిచింది.అంతేకాకుండా హౌస్ లో మరో కంటెస్టెంట్ సోహెల్ తో బద్ధశత్రువుగా ఉండి మరింత రచ్చ చేసింది.
కానీ చివరికి మంచి ఫ్రెండ్స్ గా మారారు.ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా వీరి మధ్య ఫ్రెండ్ షిప్ మరింత బలపడింది.
ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు బాగా రచ్చ చేశారు.ఇక సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకునే వాళ్ళు.
ఇక సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ తన ఫాలోవర్స్ తో అప్పుడప్పుడు ముచ్చట్లు కూడా పెడుతుంది ఈ హాట్ బ్యూటీ.

గతంలో పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.అవి కూడా చాలా వరకు క్లిక్ మనిపించాయి.ఇక ఈ బ్యూటీ కి ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫ్రెండ్స్ తో కలిసి బయట తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తుంది.
ఇక ఆ మధ్య కొత్త కారు కొనడంతో అప్పటినుంచి తన కారులో తెగ షికారులు కొడుతూ వాటికి సంబంధించిన వీడియోలను పంచుకుంటూ ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక షాకింగ్ స్టోరీ పంచుకుంది.
ఇక అందులో ఓ పాత సినిమాలోని డైలాగు ఉండగా ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.ఇక అందులో.అక్కినేని నాగేశ్వరరావు ఒక అమ్మాయితో.ఒకరితో ఇష్టం, ఒకరితో స్నేహం, ఒకరితో ప్రేమ, మరొకరితో పెళ్లి అని అడగటంతో.
అవును ఇందులో తప్పేముంది అన్నట్లుగా ఆ అమ్మాయి చెప్పగా ఆ వీడియోని పంచుకుంటూ.ఇందులో తప్పేముంది అంటూ అరియానా కూడా కామెంట్ చేసింది.
ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.







