హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం( Uppal Stadium ) వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్( India vs England ) మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ జనవరి 25న జరగనుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణలో ఉండే విద్యార్థులకు ఒక మంచి శుభవార్త తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లోని 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు ఈ టెస్ట్ మ్యాచ్ ను ఫ్రీ గా చూడవచ్చు.అంతేకాదు విద్యార్థులకు ఉచితంగా భోజనం కూడా ఇస్తారు.
విద్యార్థులు( Students ) మ్యాచ్ ను ఫ్రీ గా చూడాలంటే.పాఠశాలల ప్రిన్సిపల్స్ తమ స్కూల్ నుంచి ఎంతమంది విద్యార్థులు, ఎంతమంది సిబ్బంది వస్తున్నారో జనవరి 18వ తేదీ లోపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్( Hyderabad Cricket Association ) CEO కు ceo.hydca@gmail.com కు మెయిల్ చేయాల్సి ఉంటుంది.ఐదు రోజులపాటు జరిగే ఈ టెస్ట్ మ్యాచ్లో( Test Match ) విద్యార్థులకు ఫ్రీ ఇంటితో పాటు ఉచిత భోజన సదుపాయం( Free Food ) ఉంటుంది.భారత జట్టు టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టాప్-2 స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ చాలా కీలకం.
ఇక ఫిబ్రవరి 2వ తేదీ ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ రెండవ టెస్ట్ మ్యాచ్ జరగనుంది.మిగిలిన మూడు టెస్ట్ మ్యాచ్ లు వరుసగా రాజ్ కోట్, రాంచీ, ధర్మశాల వేదికలుగా జరగనున్నాయి.ఈ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జనవరి 25న ప్రారంభమై మార్చి 11 వరకు సాగుతుంది.
ఈ టెస్ట్ సిరీస్ కు ముందు భారత్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య భారత వేదికగా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది.తొలి టీ20 మ్యాచ్ పంజాబ్ వేదికగా జనవరి 11వ తేదీ జరగనుంది.టీ20 ప్రపంచ కప్ ముందు భారత్ తలపడే ఆఖరి టీ20 సిరీస్ ఇదే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy