పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మహత్యాయత్నం

ఈ మధ్య కాలంలో పెట్రోల్ తెలుగు రాష్ట్రాలలో రైతులకి ఆయుధంగా మారింది.

కొన్ని నెలల క్రితం ఓ రైతు ఎమ్మార్వో మీద పెట్రోల్ పోసి దాడి చేసిన సంగతి అందరికి తెలిసిందే.

ఈ ఘటన తర్వాత చాలా మంది పెట్రోల్ తో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగడం మొదలెట్టారు.ఇక రెవెన్యూ ఉద్యోగులు ఆ సంఘటన తర్వాత కాస్తా అలెర్ట్ అయ్యి రైతులని వేధించడం తగ్గించారు.

Formersuicide Attempt With Petrol-పెట్రోల్ పోసుకొ�

అయితే కొన్ని చోట్ల మాత్రం రైతుల మీద రెవెన్యూ అధికారుల వేధింపులు ఇప్పటికి షరామామూలే.అయితే రెవెన్యూ ఉద్యోగులని ఏమీ అనలేక రైతులు తమని తాము చంపుకున్తున్నారు.

తాజాగా జనగామ జిల్లా కలక్టరేట్ వద్ద ఓ రైతు పెట్రోల్ తో ఆత్మహత్యాయత్నం చేశాడు.ఈ ఘటన స్థానికంగా కలకలం అయ్యింది.

Advertisement

జనగామ మండలం వడ్లకొండ గ్రామానికి చెందిన గౌరగల్ల నరేందర్ అనే రైతు పొలంలో ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయి చాలా రోజులు అయ్యింది.దీనిపై అధికారులకి విన్నవించిన పట్టించుకోవడం లేదు.

దీంతో కరెంట్ లేక వేసిన పంటలు నాశనం అయిపోతున్నాయి.దీంతో తీవ్ర వేదనకి గురైన నరేందర్ కలెక్టర్ కి వచ్చి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు.

హుటాహుటిన అక్కడ ఉన్న పోలీసులు నరేందర్ ను కాపాడారు.అతనిని పోలీస్ స్టేషన్ కి తరలించారు.

ఫూల్ మఖనా తినడం వలన ఇన్ని లాభాలు ఉన్నాయా..?
Advertisement

తాజా వార్తలు