తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి( Congress Party ) షాక్ తగిలింది.పార్టీకి మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య( Ponnala Lakshmaiah ) రాజీనామా చేశారు.
ఈ మేరకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేకు పొన్నాల లక్ష్మయ్య లేఖ రాశారు.గతంలో పొన్నాల మంత్రిగానే కాకుండా టీపీసీసీ చీఫ్ గా పని చేసిన సంగతి తెలిసిందే.
రానున్న ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం( Janagama ) నుంచి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించారు.అయితే ఆ నియోజకవర్గం నుంచి ప్రతాప్ రెడ్డికి( Prathap Reddy ) టికెట్ ఇస్తారన్న వార్తలు జోరుగా సాగడంతో పొన్నాల పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని సమాచారం.