రాహుల్ పాదయాత్రలో ఆర్బిఐ మాజీ గవర్నర్..!!

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రకి ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుంది.

చాలామంది సెలబ్రిటీలతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు రాహుల్ తో కలిసి అడుగులు వేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులు ఇంకా సామాజిక నేతలు సైతం పాదయాత్రలో  పాల్గొంటున్నారు.కాగా లేటెస్ట్ గా అప్పట్లో మోడీ పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించిన మాజీ ఆర్బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్.

రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నారు.రాజస్థాన్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పాదయాత్రలో రాహుల్ తో కలిసి నడవడం జరిగింది.

ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు కూడా చర్చించుకున్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ  నోట్ల రద్దును వ్యతిరేకించిన టైంలో రఘురామ్ రాజన్ కాంగ్రెస్ నిర్ణయని స్వాగతించడం జరిగింది.

Advertisement

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిర్వహించిన సదస్సులో కూడా పాల్గొన్నారు.అయితే ఇప్పుడు ఏకంగా రాహుల్ గాంధీతో కలిసి రఘురామ్ రాజన్ పాదయాత్ర చేయడం జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players
Advertisement