విజయనగరం: కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు కామెంట్స్.వైసీపీ ప్రభుత్వం భాష గురించి మాట్లాడటం గమ్మత్తుగా ఉంది.
సరైన భాషను ఉపయోగించాలని వైసీపీ వాళ్ళే చెప్తున్నారు.కానీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో మీరే(పత్రికలు) రాస్తున్నారు.
సర్పంచ్ లకు విలువ లేకుండా పోయింది.వికేంద్రీకరణ అంటే ఏంటి.
కేంద్రం ఇచ్చిన నిధులును ఏమి చేస్తున్నారు.రాజధానిని మూడు ముక్కలు చేసి వికేంద్రీకరణ అని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే లాజిక్ లో వెల్లి కేంద్ర రాజధానిని కూడా వేరే వేరే ప్రదేశాల్లో పెడితే ఎలా ఉంటుంది.
ఒక రాజధానిగా ఉన్నా అధికారులు దొరకడం లేదు.
మూడు రాజధానులు చేస్తే ఎక్కడికి వెళ్ళాలి.భోగాపురం ఎయిర్పోర్ట్ కు మరలా శంకుస్థాపన చేయడం విడ్డూరం.
ఆల్రెడీ గత టీడీపీ ప్రభుత్వంలో చేసి భూ సేకరణ చేసి శంకుస్థాపన కూడా చేసాం.భాష దరిద్రమా…భావ దరిద్రమా అనేది వైసీపీ ఆలోచన చేయాలి.
జిల్లా పర్యటనకు చంద్రబాబు రావడం ఆనందంగా ఉంది.జిల్లాలో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్తాము.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధం.రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారాన్ని చేపట్టారు.
ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేయొద్దు.