బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం రాజీనామా..!

మాజీ ఎమ్మెల్యే వేమల వీరేశం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

తాజాగా కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తనకు స్థానం లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ మేరకు నల్గొండ జిల్లా నకిరేకల్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.వారం రోజుల్లో పార్టీలో చేరిక అంశంపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

గత నాలుగున్నర ఏళ్లుగా తనను ఏం చేశాంటూ హింసిస్తున్నారన్న ఆయన ఉద్యమ కాలంలో దెబ్బలు తిని జైలుకు వెళ్లిన సంగతి గుర్తు చేశారు.గన్ మెన్ లను తొలగించడంతో పాటు జిల్లా నాయకత్వం తనను పట్టించుకోలేదని వాపోయారు.

నేటితో బీఆర్ఎస్ తో ఉన్న బంధం తెగిపోయిందన్న వేముల తన రాజీనామా లేఖను అనుచరులు, నియోజకవర్గ ప్రజల ముందు ఉంచుతున్నట్లు తెలిపారు.అనంతరం నియోజకవర్గంలో దారుణాలు జరుగుతున్నాయని, వాటిపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ నేతలు చర్చకు రావాలంటూ సవాల్ చేశారు.

Advertisement
మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు