Tiger Monkey : జాతి వైరం మరిచి పులి-కోతి స్నేహం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

రెండు విభిన్న జంతువులు స్నేహం చేస్తుంటే నిజంగా ఆశ్చర్యపోతుంటాం.జాతి వైరం మరిచి అవి కలిసి మెలిసి ఉంటే చూసే వారికి చూడముచ్చటగా ఉంటుంది.

 Forget The Racial Feud And Tiger Monkey Friendship Netizens Are Wondering , Tige-TeluguStop.com

కొన్ని సందర్భాలలో ఆయా జంతువుల స్నేహం భలేగా ఉందని ప్రశంసిస్తాం.ముఖ్యంగా ఎలుక-పిల్లి, పిల్లి-కుక్క, కుక్క-కోడి వంటి కాంబినేషన్లు చూసి నవ్వుకుంటుంటాం.

అయితే తుంటరితనానికి మారుపేరుగా అంతా చెప్పుకునే కోతి జూలో పులితో స్నేహం చేస్తోంది.ఇది చూసిన వారంతా నోరెళ్లబెడుతున్నారు.

ఇక స్నేహం చేయడమే కాకుండా ఆ పులిని చితక్కొట్టి, చిత్రహింసలు పెడుతోంది.చివరికి ముద్దు పెట్టి దానితో తనకు గల అనుబంధాన్ని చాటుతోంది.

ఈ ఆసక్తికర వీడియో గురించి తెలుసుకుందాం.

ప్రస్తుత రోజుల్లో మనుషుల్లో కల్మషాలు పెరిగిపోతున్నాయి.తోటి వారితో స్థాయి, అంతస్తు వంటివి చూసుకుంటూ స్నేహం చేస్తున్నారు.అయితే జంతువులు మాత్రం చాలా కలిసి మెలిసి ఉంటున్నాయి.

కొన్ని జంతువులైతే జాతి వైరం మరిచి చాలా అన్యోన్యంగా జీవిస్తున్నాయి.ఇదే కోవలో ఓ కోతి పిల్ల, జూలో తనతో పాటు ఉంటున్న పులి పిల్లతో స్నేహం చేస్తోంది.

అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తోంది.దాని స్నేహం ఎలా ఉందంటే పులి పిల్లను బాగా కొడుతోంది.

దానిని కింద పడేసి చెవి పట్టుకుని బాగా లాగేస్తోంది.చెవి మెలి తిప్పిన తర్వాత చేతితో దాని తలపై కొడుతోంది.

చివరికి దానిని జూ సిబ్బంది మందలించగా ఆ పులి పిల్లను వదిలేసింది.ఏమనుకుందో ఏమో.చివరికి వెనక్కి వచ్చి తన ఫ్రెండ్ అయిన పులి పిల్లకి దెబ్బ తగిలిందేమోనని పరిశీలించింది.ఆపై పులి పిల్ల కాలిపై ముద్దు పెట్టుకుని తన స్నేహ బావం ఎలాంటిదో స్పష్టంగా తెలియజేసింది.

ఈ వీడియోను tigers_videos అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది.నెటిజన్లు ఆ రెండు జంతువుల స్నేహం చూసి ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube