Football Player : ఫుట్‌బాల్ ప్లేయర్‌పై పడ్డ పిడుగు.. ఆసుపత్రిలో మరణం.. వీడియో వైరల్..!

ఇటీవల కాలంలో పిడుగులు ఊహించని విధంగా మనుషుల మీద పడుతూ వారి ప్రాణాలను కబళించేస్తున్నాయి.తాజాగా ఇండోనేషియా( Indonesia )లో ఒక ఫుట్‌బాల్ ఆటగాడు పిడుగుపాటుకు గురై మరణించాడు.

 Football Player Struck By Lightning Death In Hospital Video Viral-TeluguStop.com

అతను మైదానంలో ఆట ఆడుతున్నప్పుడే పిడుగుపాటుకు గురైయ్యాడు.అయితే దీనివల్ల తీవ్ర గాయాలు అయ్యాయి.

అప్పటికి బతికే ఉన్నాడు, అయితే అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.ఈ భయానక క్షణానికి సంబంధించిన వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేశారు.

దాన్ని చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.

ఒక ఎక్స్‌ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేసి “ఇండోనేషియాలో ఫుట్‌బాల్ గేమ్‌లో ఒక వ్యక్తి పిడుగుపాటుకు గురయ్యాడు” అని చెప్పాడు.మైదానంలో ఉన్న ఆటగాడిని అకస్మాత్తుగా పిడుగు తాకినట్లు వీడియో చూపిస్తుంది.ఆపై అతడు వెంటనే కిందపడిపోతాడు.

అతనికి సహాయం చేయడానికి ఇతర ఆటగాళ్ళు పరిగెత్తారు. ఇండోనేషియాలోని వెస్ట్ జావా( West Java )లోని బాండుంగ్‌లోని సిలివాంగి స్టేడియం( Siliwangi Stadium )లో రెండు జట్ల మధ్య స్నేహపూర్వక మ్యాచ్ జరుగుతుండగా ఇది జరిగింది.

ఆటగాడి చొక్కాపై కాలిన గుర్తులను చూశానని ఓ సాక్షి చెప్పారు.

ఫిబ్రవరి 10న చనిపోయిన వ్యక్తితో పాటు చాలామంది ప్లేయర్లు ఫుట్‌బాల్ ఆడటం మొదలుపెట్టారు.కొంత సమయానికి వర్షం పడటం ప్రారంభమైంది.అప్పుడు ఓ పిడుగు అతనిని తాకింది.

ఇతర ఆటగాళ్లు అతన్ని సరినింగ్‌సిహ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.అయితే వైద్యులు అతడిని కాపాడలేకపోయారు.

ఈ ఘటన గురించి తెలుసుకొని క్రీడాకారులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక ఆటగాడికి ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం చాలా బాధాకరమని పేర్కొన్నారు.

సాధారణంగా పిడుగులు చాలా అరుదుగా పడుతుంటాయి.దురదృష్టం కొద్దీ అది ఈ ఆటగాడి పైనే పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube