ఫోన్ లో యాడ్స్ బ్లాక్ చేయాలంటే..సెట్టింగ్స్ లో ఇలా చేసేయండి..!

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ల( Smart Phones ) ద్వారానే దాదాపుగా అన్ని ముఖ్యమైన పనులు సులభతరం అయ్యాయి.

అయితే మనం కాస్త బిజీ గా ఉన్నప్పుడు మధ్యలో యాడ్స్ ( Ads )వచ్చి చేసే పనికి అంతరాయం కలుగుతుంది.

ఇక ఫోన్ ద్వారా డబ్బులు చెల్లించే సమయాల్లో యాడ్స్ వస్తే.ట్రాన్సాక్షన్స్ మధ్యలో ఆగిపోయి కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఆపిల్ ఐఫోన్ లో ప్రకటనలు కనిపించవు కాబట్టి ఆ ఫోన్ వాడే వారికి ఇలాంటి ఇబ్బందులు ఎదురు కావు కానీ ఆండ్రాయిడ్ ఫోన్లకు( Android Phones ) యాడ్స్ వస్తూనే ఉంటాయి.యాడ్ వచ్చినప్పుడు పైన కనిపించే క్రాస్ (*) నొక్కి యాడ్స్ మూసివేస్తుంటాం.

అయితే ఆండ్రాయిడ్ ఫోన్లకు యాడ్స్ రాకుండా సులభంగా బ్లాక్ చేయవచ్చు.సెట్టింగ్స్ లోకి వెళ్లి ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.యాడ్స్ ను బ్లాక్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

Advertisement

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళాక గూగుల్( Google ) అనే ఆప్షన్ కనిపిస్తుంది.ఆ గూగుల్ పై క్లిక్ చేస్తే మ్యానేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.

దానిపై క్లిక్ చేస్తే డేటా గోప్యత ఆప్షన్ కనిపిస్తుంది.

అక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే పర్సనలైజ్డ్ యాడ్స్( Personalized Ads ) అని కనిపిస్తుంది.ఇందులో మీ యాక్టివిటీలలో ఏవి ట్రాక్ అవుతున్నాయో తెలుసుకోవచ్చు.ట్రాక్ అయ్యే యాక్టివిటీల ద్వారానే ఫోన్ కు యాడ్స్ వస్తుంటాయి.

అక్కడ మై యాడ్ సెంటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.దానిని క్లిక్ చేసిన తర్వాత పర్సనలైజ్డ్ యాడ్స్ టోగుల్ ఓపెన్ అవుతుంది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
సినిమా ట్రైలర్స్ వ్యూస్ వెనుకున్న అసలు మోసం ఏంటో తెలుసా?

దాన్ని ఆఫ్ చేయాలి.ఆ తర్వాత అక్కడ డిలీట్ advertising ID ని క్లిక్ చేస్తే చాలు.

Advertisement

స్మార్ట్ ఫోన్ కు అనవసరమైన యాడ్స్ రావు.

తాజా వార్తలు