Pimples Blemishes : ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే మొటిమలే కాదు వాటి తాలూకు మచ్చలు సైతం పరార్!

సర్వసాధారణంగా వేధించే చర్మ సమస్యల్లో మొటిమలు ముందు వరుసలో ఉంటాయి.ఇందులో ఎటువంటి సందేహం లేదు.

పైగా కొందరిలో మొటిమల వల్ల మచ్చలు సైతం పడుతుంటాయి.ఈ మ‌చ్చ‌లు ముఖ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తిస్తాయి.

ఈ క్రమంలోనే మొటిమ‌ల తాలూకు మ‌చ్చ‌ల‌ను వదిలించుకోవడం కోసం తోచిన ప్రయత్నాలు అన్ని చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను క‌నుక పాటిస్తే మొటిమలే కాదు వాటి తాలూకు మచ్చలు సైతం పరార్ అవ్వ‌డం ఖాయం.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ లవంగాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్‌ వాటర్ ను పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో గుప్పెడు వేపాకు, హాఫ్ టేబుల్ స్పూన్ లవంగాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని పన్నెండు నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను స్ట్రైనర్‌ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ వాటర్ ను ఒక బాటిల్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజుకు రెండు నుంచి మూడు సార్లు ఈ వాటర్ ను దూది సహాయంతో ముఖంపై అప్లై చేసుకుని పూర్తిగా ఆరిన అనంతరం నార్మల్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేస్తే మొటిమలు చాలా త్వరగా త‌గ్గు ముఖం పడతాయి.అలాగే మొటిమలు తాలూకు మచ్చలు సైతం క్రమంగా మాయం అవుతాయి.పైగా ఈ చిట్కా ను పాటించడం వల్ల చర్మం తేమగా మరియు నిగారింపుగా సైతం మెరుస్తుంది.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

కాబట్టి మొటిమలు, వాటి తాలూకు మచ్చలతో సతమతం అయ్యే వారు ఖ‌చ్చితంగా ఈ చిట్కాను పాటించేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.

Advertisement

తాజా వార్తలు