ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే చలికాలంలోనూ మీ పాదాలు మృదువుగా కోమలంగా మెరుస్తాయి!

చలికాలం వచ్చిందంటే చాలు ఎన్నో చర్మ సమస్యలు( Skin problems ) ఇబ్బంది పెడుతుంటాయి.చర్మం మొత్తం డ్రై గా మారిపోతుంది.

ఇక పాదాలు ( Feet )గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.పొడిబారిపోయి నిర్జీవంగా మారుతుంటాయి.

అటువంటి పాదాలను చాలా మంది ఇష్టపడరు.ఈ క్రమంలోనే వాటిని రిపేర్ చేసుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీ మీకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

Advertisement

ఈ రెమెడీని పాటిస్తే చలికాలంలోనూ మీ పాదాలు మృదువుగా, కోమలంగా మరియు అందంగా మెరుస్తాయి.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌ వేసుకొని మూడు కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఐదు నిమిషాల పాటు కలిపితే ఒక మంచి క్రీమ్ సిద్ధమవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మరియు నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్ ను పాదాలకు అప్లై చేసుకోవాలి.

అలోవెరా,( Aloe vera ) విటమిన్ ఈ ఆయిల్ మరియు ఆలివ్ ఆయిల్( Olive oil ).ఈ మూడు న్యాచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ఈ మూడింటితో క్రీమ్ తయారు చేసుకుని పాదాలకు అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ఈ న్యాచురల్ క్రీమ్ పొడిబారిన మీ పాదాలను మృదువుగా, కోమలంగా మారుస్తుంది.అందంగా మెరిపిస్తుంది.

Advertisement

ఈ క్రీమ్ ను వాడితే డ్రైనెస్ సమస్య ఉండదు.ఇక కొందరు పాదాల పగుళ్లతో చాలా బాధపడుతుంటారు.

ఆ సమస్యకు కూడా ఈ క్రీమ్ ఉపయోగపడుతుంది.రోజు నైట్ నిద్రించే ముందు పగుళ్లపై ఈ క్రీమ్ ను అప్లై చేసుకుని సాక్స్ ధరించి పడుకోవాలి.

ఇలా నిత్యం కనుక చేస్తే పగుళ్లు పూర్తిగా మాయం అవుతాయి.

తాజా వార్తలు