వేసవిలో అజీర్తి, గ్యాస్ సమస్యలు అధికంగా ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

ఎండలు దంచికొడుతున్నాయి.ఉదయం 9 గంటల నుంచే భానుడు భగభగ మంటున్నాడు.

అయితే వేసవి కాలంలో డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్( Dehydration, heat stroke ) వంటివే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలు కూడా అధికంగా ఇబ్బంది పెడుతుంటాయి.ముఖ్యంగా చాలా మంది వేసవిలో అజీర్తి, గ్యాస్ సమస్యలతో తరచూ ఇబ్బంది పడుతుంటారు.

వేసవిలో అధిక వేడి కారణంగా ఆహారం జీర్ణం కావడం కష్టతరంగా మారుతుంది.ఫలితంగా అజీర్తి, గ్యాస్( Indigestion, gas ) తదితర జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

వీటికి చెక్ పెట్టాలంటే కొన్ని టిప్స్ కచ్చితంగా పాటించాల్సిందే.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Follow These Simple Tips To Get Rid Of Digestive Problems In Summer! Digestive P

అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి క్షణాల్లో రిలీఫ్ అందించడానికి ఇంగువ చాలా బాగా సహాయపడుతుంది.ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ‌( hing ) కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఇంగువ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.కాబట్టి నిత్యం వంటల్లో ఇంగువ వాడితే ఇంకా మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు.

Follow These Simple Tips To Get Rid Of Digestive Problems In Summer Digestive P

బ్రోకలీ, కిడ్నీ బీన్స్, బఠానీలు, క్యాబేజీ ( Broccoli, kidney beans, peas, cabbage )వంటి ఆహారాలను వేసవికాలంలో తీసుకోవడం నివారించండి.ఇటువంటి అధిక ఫైబర్ ఫుడ్స్ స‌రిగ్గా జీర్ణం కావు.ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల జీర్ణవ్యవస్థలో గ్యాస్ ఏర్ప‌డుతుంది.

అలాగే గ్యాస్, అజీర్తి, క‌డుపు ఉబ్బ‌రం వంటి సమస్యల నుండి రిలీఫ్ పొంద‌డానికి యాపిల్ సైడ‌ర్ వెనిగర్ సహజమైన మార్గం.ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో వ‌న్ టేబుల్ స్పూన్‌ యాపిల్ సైడ‌ర్ వెనిగర్ వేసి తాగితే పొట్ట ఫ్రీగా మారుతుంది.

Follow These Simple Tips To Get Rid Of Digestive Problems In Summer Digestive P
పెళ్ళైన వాడితో ప్రేమలో పడ్డ హీరోయిన్ కుష్బూ..ఇందులో నిజమెంత.. ?

వేలకు ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా జీర్ణ సమస్యలు త‌లెత్తుతాయి.కాబట్టి టైమ్ టు టైమ్‌ ఫుడ్ తీసుకోవడం అలవాటు చేసుకోండి.ఇక‌ గ్యాస్ అజీర్తి వంటి సమస్యలను దూరం చేయడానికి అల్లం టీ బాగా సహాయపడుతుంది.

Advertisement

ఒక కప్పు అల్లం టీ తాగితే ఆయా జీర్ణ సమస్యలు పరారవుతాయి.అల్లం టీ కి బదులుగా సోంపు టీ లేదా వాము నీరు తీసుకున్న మంచి ఫలితం ఉంటుంది.

కూల్ డ్రింక్స్, సోడా, టీ, కాఫీ వంటి పానీయాలను దూరం పెట్టండి.ఎందుకంటే ఇవి జీర్ణ సమస్యలను మరింత తీవ్రత‌రం చేస్తాయి.

తాజా వార్తలు