ఈ సింపుల్ టిప్స్ ను పాటిస్తే పైసా ఖర్చు లేకుండా బ్యూటిఫుల్ పింక్ లిప్స్ ను సొంతం చేసుకోవచ్చు!

ముఖ సౌందర్యాన్ని మరింత అందంగా, ఆకర్షణీయంగా మార్చే వాటిలో పెదాలు ముందు వరుసలో ఉంటాయి.

ముఖ్యంగా పెదాలు గులాబీ రంగులో మెరుస్తూ కనిపిస్తే ఎవ్వరైనా సరే కళ్ళు తిప్పుకోలేరు.

అందుకే ఆడవారంతా పింక్ లిప్స్ కోసం ఆరాటపడుతుంటారు.మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ పాటిస్తే పైసా ఖర్చు లేకుండా బ్యూటిఫుల్ పిక్ లిప్స్( Beautiful pic lips ) ను మీ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంతకీ ఆ టిప్స్ ఏంటి.? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

పుదీనా పెదాల నలుపును వదిలించడానికి అద్భుతంగా సహాయపడుతుంది.కొన్ని పుదీనా ఆకులను తీసుకొని మెత్తగా దంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ బాదం నూనె( Almond oil ) కలిపి బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.పూర్తిగా ఆరిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఇలా కనుక చేస్తే పెదాలు నలుపు పోయి గులాబీ రంగులోకి మారతాయి.

Advertisement

అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు బీట్ రూట్ జ్యూస్‌( Beet root juice ), వన్ టేబుల్ స్పూను అలోవెరా జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మంచి క్రీమ్ సిద్ధమవుతుంది.ఈ క్రీమ్ ను రోజుకు రెండుసార్లు వాడితే మీ పెదాలు సహజంగానే పింక్ కలర్ లోకి మారతాయి.

నిమ్మరసం డార్క్ లిప్స్ సమస్యను దూరం చేస్తుంది.ఫ్రెష్ నిమ్మరసాన్ని పెదాలపై అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు వదిలేయాలి.

ఆపై శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ విధంగా రోజు చేస్తే డార్క్ లిప్స్ ( Dark lips )అందంగా మారతాయి.ఇక మరొక‌ సూపర్ టిప్‌ ఏంటంటే ఒక బౌల్ తీసుకుని అందులో పావు టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి కలిపి పెదాలకు పూయాలి.15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసిన కూడా పింక్ లిప్స్ మీ సొంతం అవుతాయి.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు