వీడియో: జిమ్‌లోనే యువతిపై రేప్ అటెంప్ట్.. కామాంధుడికి చుక్కలు చూపించింది!

కామాంధులకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది.ఏ చిన్న సంధు దొరికినా వెంటనే వారు లైంగిక దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు వారు అందరిపై చేసే ఆగడాలు చాలామందికి షాక్ ఇస్తున్నాయి.కాగా తాజాగా ఒక నీచుడు జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఒక యువతిపై లైంగిక అఘాయిత్యానికి ప్రయత్నించాడు.

ఆ యువతి చాలా ధైర్యం తెచ్చుకొని అతనితో పోరాడి తన మానప్రాణాలను కాపాడుకోగలిగింది.ఆమె అతడితో పోరాడుతున్న దృశ్యాలు జిమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి.

Florida Woman Defends Herself From Alleged Rapist In Gym Details, Florida Woman

దానికి సంబంధించిన వీడియో రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీన్ని చూసి చాలా మంది దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు ఆ యువతి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.

Advertisement
Florida Woman Defends Herself From Alleged Rapist In Gym Details, Florida Woman

మహిళలందరూ ఇలాగే పోరాడి కామాంధుల భరతం పట్టాలని అంటున్నారు.ఈ అత్యాచారం నుంచి తప్పించుకోగలిగిన యువతి ఒక ఇన్‌స్టాగ్రామ్ ఫిట్‌నెస్ మోడల్.

ఆమె పేరు నషాలి అల్మా. 24 ఏళ్ల వయసున్న ఈ యువతి రీసెంట్‌గా ఫ్లోరిడాలోని టంపాలోని తన ఇన్‌వుడ్ పార్క్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఒంటరిగా వ్యాయామం చేస్తుండగా ఒక వ్యక్తి జిమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Florida Woman Defends Herself From Alleged Rapist In Gym Details, Florida Woman

నిజానికి అతను కూడా వర్కౌట్ చేస్తాడేమో అని డోర్ తెరిచి లోపలికి అనుమతించింది, కానీ క్షణాల తరువాత, అతను ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించాడు.బాడీబిల్డింగ్ నుంచి పొందిన బలం, మనస్తత్వంతో ఆమె జిమ్‌లో తనపై అత్యాచారం చేయబోయే వ్యక్తితో పోరాడింది.పోలీసులను పిలవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె అతడిపై భౌతికంగా బాగా దాడి చేసింది.

మహిళలు ఎప్పటికీ లొంగిపోకూడదని, శరీరంలో సత్వ ఉన్నంతవరకు పోరాడాలని ఆమె అందరు అమ్మాయిలకు సలహా ఇచ్చింది.వీలైతే ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఆమె తెలిపింది.

అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమాలో నటిస్తారా.. షాలిని పాండే రియాక్షన్ ఇదే!
తగ్గేదెలా.. వెస్టిండీస్ బౌలర్ పై కాలు దువ్విన యువరాజ్ సింగ్

ఇక దాడి చేసిన వ్యక్తిని అరెస్టు పోలీసులు అరెస్టు చేసి జైలు పంపించారు.

Advertisement

తాజా వార్తలు