మైలవరం మండలంలోని వెల్వడం గ్రామంలో ఫ్లెక్సీల కలకలం

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం: మైలవరం మండలంలోని వెల్వడం గ్రామంలో ఫ్లెక్సీల కలకలం.వినూత్నంగా నిరసన తెలుపుతున్న వెల్వడం గ్రామ భూ నిర్వాసితులు.

7సంవత్సరాల క్రితం రోడ్ విస్తరణలో భూములు కోల్పోయిన వెల్వడం, చంద్రాల గ్రామాలకు చెందిన సుమారు 130 కుటుంబాలు.నేటి నుండి జగనన్న సురక్ష లో భాగంగా ఇంటింటికీ వెళ్ళనున్న అధికారులకు గ్రామస్తుల ఝలక్.

ఇళ్ళ ముందు గోడలకు పోస్టర్ లు అంటించిన గ్రామస్తులు,రాత్రికి రాత్రే గ్రామంలోని ఇళ్ళకు పోస్టర్ లు.గ్రామంలో ప్రథాన రహదారి వెంట ఇళ్ళకు దర్శనమిస్తున్న నిరసన పోస్టర్లు.రోడ్ విస్తరణలో భూములు కోల్పోయిన తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్.

మా సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి,జగనన్న సురక్ష లో మీరు మాకు చేయాల్సిన న్యాయం ఇదే అంటూ గ్రామ ఎంట్రన్స్ లో ఫ్లెక్సీ ఏర్పాటు.జగనన్నా ఆదుకో అంటూ వేడుకుంటున్న గ్రామస్తులు.2019 పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే నెల లోపు మా సమస్యను పరిష్కరిస్తామని మాకు హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రి గా ఆయనకి ఎన్నో భాద్యతలు,మా సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి,పరిష్కారమౌతుందని ఆశిస్తున్నాము అంటూ అధికారులను వేడుకుంటున్న గ్రామస్తులు.

Advertisement
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు