పెళ్లి కాకుండా తిరిగితే అందరికి ఇదే శిక్ష... అందరి ముందు యువ జంటకు శిక్ష వేసిన స్థానిక మతాధికారులు

ముస్లీం మతాచారాలు దారుణంగా ఉంటాయని చెప్పడంలో అతి శయోక్తి లేదు.కొన్ని ముస్లీం దేశాల్లో ఆడవారు అత్యంత అధమ స్థాయి వారిగా గుర్తించడం జరుగుతుంది.

ఆడవారు బయటకు వెళ్లే పరిస్థితి కూడా ఉండదు.ఈమద్య కాలంలో కొంత మంది ఆడవారు బయటకు వచ్చేందుకు ముస్లీం మత పెద్దలు అనుమతిని ఇస్తున్నారు, కాని గతంలో అయితే ఆడవారు బయటకు వెళ్లకుండా కట్టుదిట్టంగా చట్టాలు ఉండేవి.

ముఖ్యంగా ముస్లీం పాలిత దేశాల్లో అయితే బుర్కా లేకుండా స్త్రీలు బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవు.ఇక పెళ్లిక ముందు కలిసి ఫొటోలు దిగడం, పెళ్లికి ముందు కలవడం వంటివి చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో గతంలో వార్తల్లో చూశాం.

మన దేశంలో కూడా ముస్లీంలు పెళ్లిలో ఫొటోలు దిగి, డాన్స్‌లు వేశారు అంటూ ఒక కుటుంబంను వెలివేసిన విషయం తెల్సిందే.అంత కఠినంగా ముస్లీం నిబంధనలు ఉంటాయి కనుక కొన్ని ముస్లీం దేశాలపై అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

తాజాగా జరిగిన మరో సంఘటన తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.ఇండోనేషియాలోని అకే ప్రావిన్స్‌లో జరిగిన ఈ సంఘటన ఆ దేశం మొత్తంతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ముస్లీం మత విధానాలపై మళ్లీ చర్చించుకునేలా చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.పెళ్లి కాకుండానే 5 యువ జంటలు రోడ్డు పై చెట్టా పట్టాలు వేసుకుని, ఒకరి చేతిలో ఒకరి చేయి పట్టుకుని తిరగడం జరిగింది.ఆ దేశ ముస్లీం చట్ట ప్రకారం అది నేరం.

ఒక పెళ్లి కాని ముస్లీం యువతి అలాంటి పనులు చేయడం ఏమాత్రం సబబు కాదు.అందుకే ఆ అయిదు జంటలకు కూడా జైలు శిక్షతో పాటు బహిరంగ కొరడా దెబ్బలను కూడా స్థానిక మత పెద్దలు విధించారు.50 కొరడా దెబ్బలను 5 జంటలకు బహిరంగంగా శిక్షించడంతో పాటు, అత్యంత దారుణంగా వారినిపై దాడి చేశారు.అదే సమయంలో పెళ్లి కాకుండా తిరిగితే ఎవరికి అయినా ఇదే శిక్ష, ముస్లీం మతాచారాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తే ఎవరిని కూడా ఉపేక్షించం అంటూ హెచ్చరించారు.

మతాధికారుల శిక్షలకు అంతర్జాతీయ సమాజం విమర్శలు చేస్తుంది.2020లో ఇలాంటి ఇలాంటి శిక్షలు ఏంటీ అంటూ మండి పడుతున్నారు.పెరిగిన అభివృద్దితో అంతా మారాలని సూచిస్తున్నారు.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?

కాని ముస్లీం పెద్దలు మాత్రం అందుకు ససేమేరా అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు