యూత్ సెన్షేషన్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.పెద్ద ఎత్తున ఈ చిత్రం కోసం విజయ్ కష్టపడుతున్నాడు.
వరుసగా షూటింగ్స్‌లో పాల్గొన్న కారణంగానే తాజాగా విజయ్ దేవరకొండ అస్వస్థతకు గురైన విషయం తెల్సిందే.ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు డియర్ కామ్రేడ్ బిజినెస్ గురించి సినీ వర్గాల్లో కుప్పలు తెప్పలుగా చర్చ జరుగుతోంది.
పెట్టిన పెట్టుబడిని నిర్మాతలకు విడుదలకు ముందే రెట్టింపు లాభం వచ్చేలా కనిపిస్తోంది.అన్ని ఏరియాల్లో కూడా ఈ చిత్రంకు భారీ డిమాండ్ ఉందని సమాచారం అందుతోంది.
డియర్ కామ్రేడ్ చిత్రం నైజాం ఏరియాలో ఏషియన్ మూవీస్ వారు 7.5 కోట్లకు కొనుగోలు చేశారట.ఇక ఏపీలో ఈ చిత్రం దాదాపు 7 కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని, సీడెడ్‌లో అయిదు కోట్ల వరకు రాబట్టడం ఖాయం అంటున్నారు.ఇక శాటిలైట్ రైట్స్, ప్రైమ్ వీడియో రైట్స్ ద్వారా సునాయాసంగా 10 నుండి 12 కోట్ల వరకు రాబట్టడం జరుగుతుంది.
ఇక ఓవర్సీస్లో ఈ చిత్రం మూడున్నర నుండి అయిదు కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.సినిమాకు రోజు రోజుకు క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెంబర్స్ మరింతగా పెరిగినా ఆశ్చర్య పోనక్కర్లేదు.
20 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంకు భరత్ కమ్మ దర్శకత్వం వహించాడు.తాజాగా విడుదలైన టీజర్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఈ చిత్రం కన్నడం, తమిళం, మలయాళంలో కూడా విడుదల చేయబోతున్నారు.తమిళ రైట్స్ ద్వారా మూడు కోట్లు, మలయాళ రైట్స్ ద్వారా కోటి రూపాయలు, కన్నడ రైట్స్ ద్వారా నాలుగు కోట్ల వరకు నిర్మాతలకు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
మొత్తంగా చూసుకుంటే ఈ చిత్రం దాదాపుగా 50 కోట్లకు పైగానే బిజినెస్ చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.విజయ్ దేవరకొండ క్రేజ్‌కు ఇది నిదర్శణంగా చెప్పుకోవచ్చు.దానికి తోడు ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్న నటించడం కూడా, అదే విధంగా ముద్దు సీన్స్ ఈ చిత్రంలో ఉన్న కారణంగా బయ్యర్లు ఎగబడి కొంటున్నారు.మే చివర్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.