తొలి రోజు దేశవ్యాప్తంగా ఎంత మంది టీకా వేయించుకున్నారంటే..!?

శనివారంనాడు ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున ప్రారంభించారు.అయితే ఈ కార్యక్రమాన్ని భారత దేశంలోని చాలా రాష్ట్రంలో భారీగా నిర్వహించారు.

 First Day How Many Member Are Take Vakshin, Carona Virus, Covid 19, Carona Vacci-TeluguStop.com

దీంతో తొలిరోజు భారత దేశ వ్యాప్తంగా 1,91, 181 మందికి టీకా వేశారు వైద్యాధికారులు.ఈ టీకా వేసుకునే వారిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, అలాగే అనారోగ్యం పాలవడం కాని జరగలేదని తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చింది.

మొదటి రోజు భారత దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది.ఇందులో భాగంగానే అనేక దేశాలలో వ్యాక్సిన్ తీసుకున్న కారణంగా ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతున్న సమయంలో భారతదేశంలో అటువంటివి చోటుచేసుకోవడం భారతీయులకు మంచి శుభవార్త అని తెలియజేశారు.

భారత్ శక్తిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పినట్టు ఈ సందర్భం దోహదపడుతుందని తెలియజేస్తున్నారు అధికారులు.శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలు పెట్టగా.

అనంతరం దేశవ్యాప్తంగా 3351 కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.ఇందులో మొత్తం 16755 మంది సిబ్బంది పాల్గొనట్లు అధికారులు తెలుపుతున్నారు.

అయితే ఈ వ్యాక్సినేషన్ ఇచ్చే కొన్ని కేంద్రాలలో టెక్నికల్ సమస్యలు రావడం ద్వారా ఈ వాక్సినేషన్ కార్యక్రమం మొదలు పెట్టడం కాస్త ఆలస్యం జరిగింది.

Telugu Lakshs, Carona, Covid, Effetcs-Latest News - Telugu

తొలిరోజు భారతదేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాలలో కొవాగ్జిన్‌, 11 రాష్ట్రాలలో కొవిషీల్డ్ పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేశారు.దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో లో మూడు వేల మందికిపైగా వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ చేయించుకున్నట్లు అధికారులు తెలియజేశారు.దేశవ్యాప్తంగా జరిగిన వ్యాక్సినేషన్ పై ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు.

ఇందులో భాగంగానే కరోనా వాక్సినేషన్ ప్రక్రియ దేశంలో మొదలుకావడం దేశ ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని కరోనా వైరస్ పై పోరాటం చేసేందుకు ఈ వ్యాక్సినేషన్ ఓ సంజీవనిలా పనిచేస్తాయని హర్షవర్ధన్ తెలియజేశారు.ఈ వ్యాక్సినేషన్ లు తయారు చేసిన ఫార్మా సంస్థలకి శాస్త్రవేత్తలకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube