సీఎం చంద్రబాబు నివాసం సమీపంలో అగ్నిప్రమాదం

ఎపి సిఎం చంద్రబాబు నివాసం సమీపంలో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.

అమరావతి లోని ఉండవల్లి లో కరకట్ట వద్ద ఏపీ సీ ఎం చంద్రబాబు నివాసం ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ఉండవల్లి కరకట్ట పక్కనే ఉన్న ఎండుగడ్డి కి మంట అంటుకోవడం తో ఈ ప్రమాదం జరిగింది.అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు.

Fire Accident Occured Near Ap Cm House-సీఎం చంద్రబాబు

ఎండుగడ్డి కి అంటుకున్న మంటలు ఆ పక్కనే ఉన్న పంట పొలాలకు కూడా వ్యాపించడం తో అధికారులు అప్రమత్తమయ్యారు.సీఎం నివాసానికి సమీపంలో ఈ మంటలు చెలరేగడం తో అధికారులు అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

దీనితో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకి చేరుకొని మంటలను అదుపు చేయడం తో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.అయితే అక్కడ మంటలు ఎలా రాజుకున్నాయి అన్న విషయం పై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.దీనికి సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పెట్రోలియం జెల్లీని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చో తెలుసా?
Advertisement

తాజా వార్తలు