సైరా సెట్ లో భారీ అగ్నిప్రమాదం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకు కేరళ లో చిత్రీకరణ జరుపుకొని తిరిగి వచ్చింది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వీలైనంత వేగంగా పూర్తి చేసే ప్రయత్నంలో దర్శకుడు సురేందర్రెడ్డి ఉన్నాడు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్లో లో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ శివార్లలో కోకాపేటలో ఏర్పాటుచేసిన సెట్ లో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.ఈ ప్రమాదంలో మొత్తం కాల్ కోరినట్లు సమాచారం.

అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.ఇప్పటికే ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో సైరా సెట్ ఇలాగే అగ్నిప్రమాదానికి కాలి బూడిద అయింది.

Advertisement

మరోసారి అలాంటి అగ్నిప్రమాదం సైరా షూటింగ్ సెట్లో జరగడం ఇప్పుడు చిత్ర యూనిట్ ని కలవరపెడుతుంది.మరి దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి ఇ వివరణ ఇస్తాడు అనేది వేచి చూడాలి .

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు