కొట్లాట : మన సినిమాల కోసం అక్కడ.. వాళ్ళ సినిమాల కోసం ఇక్కడ

ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలు ఎక్కువైపోయాయి.ఒక భాషలో బాగా హిట్ అయిన చిత్రాన్ని ఇంకొక భాషలో అనువదిస్తూ కొంతమంది కోట్లు సంపాదిస్తున్నారు.

ఒక మంచి సబ్జెక్ట్ ఎక్కడ దొరికిన దాని కాపీ రైట్స్ కొనుక్కొని ఆ హీరోకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి ఆ హీరో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు.ఇప్పుడు ఈ ట్రెండే  నడుస్తుంది.

ఇటువలే వచ్చిన బీమ్లా నాయక్ సినిమా కూడా అంతే.ఈ సినిమా మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాని పవర్ స్టార్ కి తగ్గట్టుగా మార్పులు చేసి సూపర్ హిట్ కొట్టారు.

అంతేకాదు పవర్ స్టార్ బ్రదర్ మెగాస్టార్ గారు కూడా.ఈ కోవలోనే వెళ్తూ మలయాళంలో సూపర్ హిట్టయిన లూసిఫర్ సినిమాని గాడ్ ఫాదర్ గా ఇప్పుడు రిమేక్ చేస్తున్నారు.

Advertisement

అలాగే విక్టరీ వెంకటేష్ కూడా మలయాళంలో నుండే దృశ్యం, దృశ్యం-2 సినిమాలను రీమేక్ చేసి సంచలన విజయం సాధించాడు.

అందుకే ఇప్పుడు మన తెలుగు వాళ్ల చూపంతా మలయాళం లో ఏ సినిమాలు హిట్ అవుతున్నాయి అన్న దానిపైనే ఉంది.మరి మలయాళంలో ఈ మధ్య కాలంలో మంచి విజయం సాధించిన సినిమా ఏదైనా ఉంది అంటే.అది ఉడుంబు అనే సినిమా.

మరి ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ కోసం ఎంతో మంది పోటీపడగా.ఆ అవకాశం నిర్మాత గంగ పట్నం శ్రీధర్ గారికి వచ్చింది.

ఆయన కొంచెం ఎక్కువ కష్టపడే ఉడుంబు రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడు.అయితే మనకి హీరోలు హీరోయిన్లు ఆర్టిస్టు తెలిసినంత ఈజీగా ప్రొడ్యూసర్లు ఎక్కువ తెలియక పోవచ్చు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

అందుకోసం మనం గంగపట్నం శ్రీధర్ గారి గురించి మాట్లాడుకుంటే గతంలో ఆయన ‘అంజలి’ అనే టైటిల్ పాత్రలో చిత్రాంగద అనే సినిమా తీశారు.అలాగే సుమంత్ తో ‘ఇదం జగత్”, ఛార్మితో మంత్ర మరియు మంగళ చిత్రాలను నిర్మించి హిట్ కొట్టారు.

Advertisement

అంతే కాకుండా సుకుమార్ గారి కుమారి 21ఎఫ్ చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేసాడు.ఇప్పుడు రమ్యకృష్ణ గారితో కన్నడలో శివగామి చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఇక మలయాళంలో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఉడుంబు సినిమా గురించి మాట్లాడు కుంటే ఇది ఒక మంచి యాక్షన్ డ్రామా చిత్రంగా తెలుస్తోంది.ఈ చిత్రం శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై త్వరలోనే సెట్స్ కు వెళ్లనుంది.ఇంకా టైటిల్ పెట్టని ఈ క్రేజీ చిత్రానికి ప్రస్తుతం స్క్రిప్ట్ పనులతో పాటు నటీ నటులు-సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.

మొత్తానికి మళయాళంలో మంచి హిట్టయిన సినిమాలను ఎక్కువగా ఈ మధ్య తెలుగులోకి తీసుకు వస్తున్నారు.అలాగే తెలుగు సినిమాల కోసం హిందీ వాళ్ళు కూడా పోటీ పడుతున్నారు.

ఏదైనా తెలుగు తమిళ్, మలయాళం కన్నడ ఇలా సౌత్ మూవీస్ కి క్రేజ్ రోజు రోజుకు పెరిగి పోతోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

తాజా వార్తలు