ఎంత నీర‌సంగా ఉన్నాస‌రే.. ఈ స్మూతీని తీసుకుంటే త‌క్ష‌ణ శ‌క్తి పొందొచ్చు!

నీరసం.విన‌డానికి ఇది చాలా చిన్న సమస్యగానే అనిపించినా తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది.

నీరసం వల్ల ఏ పనిని చేయలేకపోతుంటారు.కాసేపు నిలబడాలన్నా ఓపిక ఉండదు.

దాంతో తరచూ మంచానికే పరిమితం కావాల్సి ఉంటుంది.అందుకే నీరసం నుంచి బయట పడటం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే స్మూతీని కనుక తీసుకుంటే ఎంతటి తీవ్రమైన నీరసం అయినా పరార్ అవుతుంది.అదే సమయంలో శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

Advertisement
Fatigue Will Go Away If You Take This Smoothie , Fatigue, Smoothie, Health, Heal

మరి ఇంతకీ ఆ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో అర కప్పు బాగా పండిన పైనాపిల్ ముక్కలు, అర కప్పు క్యారెట్ ముక్కలు, ఒక అరటి పండు, చిటికెడు పసుపు, అర అంగుళం అల్లం ముక్క, చిటికెడు దాల్చిన చెక్క పొడి, రెండు రాత్రంతా నానబెట్టుకున్న డ్రై అంజీర్, ఒక గ్లాసు ఇంట్లో తయారు చేసుకున్న బాదం పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Fatigue Will Go Away If You Take This Smoothie , Fatigue, Smoothie, Health, Heal

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వ‌న్‌ టేబుల్ స్పూన్ నాన పెట్టుకున్న చియా సీడ్స్ వేసి మిక్స్ చేస్తే నీర‌సాన్ని త‌రిమికొట్టే సూప‌ర్ స్మూతీ సిద్ధమయినట్టే.ఈ స్మూతీని ఉదయం పూట తీసుకుంటే కనుక నీరసం నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.అదే సమయంలో శరీరానికి అవసరమయ్యే శక్తి క్షణాల్లో లభిస్తుంది.

అంతేకాదు, ఈ స్మూతీని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే రోజంతా యాక్టివ్‌గా మరియు ఎనర్జిటిక్‌గా ఉంటారు.అలాగే ఈ స్మూతీని తీసుకోవడం వల్ల అధిక ఆకలి సమస్య దూరం అవుతుంది.

వెయిట్ లాస్ అవుతారు.గుండె ఆరోగ్యంగా మారుతుంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

మెద‌డు మునుప‌టి కంటే చురుగ్గా ప‌ని చేస్తుంది.చర్మం నిగారింపు గా సైతం మెరుస్తుంది.

Advertisement

తాజా వార్తలు