టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కృతి సనన్( Prabhas Kriti Sanon ) జంటగా నటించిన తాజా చిత్రం ఆదిపురుష్.ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా జరిగింది.కనీ విని ఎరుగని రీతిలో దాదాపు లక్షకు పైగా అభిమానులు అక్కడికి చేరుకొని ప్రభాస్ జై శ్రీరామ్ అంటూ తిరుపతి( Tirupati ) మొత్తం మారుమోగేలా సందడి సందడి చేశారు.
ఈ క్రమంలోనే భారీగా తోపులాట జరిగింది.అయితే అంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటున్న క్రమంలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది.

తాజాగా మంగళవారం సాయంత్రం తిరుపతిలో ఆదిపురుష్</em( Adipurush ) ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే.భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చి ఈవెంట్‌ని గ్రాండ్ సక్సెస్ ఫుల్ చేశారు.అయితే ఇక్కడ ప్రభాస్ అభిమానులు ఒక వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు.అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ వ్యక్తి ఏం మాట్లాడారో తెలియదు కానీ ఇద్దరు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం అతనిపై దాడి చేశారు.మొదట ఒక వ్యక్తి కాలితో తన్ని ఆ తర్వాత చెంపపై గట్టిగా రెండు సార్లు కొట్టి అతనికి సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు.

ఇక అతన్ని కొడుతుండగా పక్కనే ఉన్న కొందరు వ్యక్తులు వారిని ఆపారు.అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ వీడియోని చూసిన కొందరు నెటిజెన్స్ ఆ వ్యక్తి మహేష్ బాబు అభిమాని అని ప్రభాస్ ( Prabhas )పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వాళ్లు ఆ విధంగా కొట్టారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈవెంట్‌లో ఒక యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతోనే ఇలా చేశారని మరికొంత మంది చెబుతున్నారు.సదరు వీడియో పై స్పందించిన కొందరు నెటిజన్స్ వారిపై మండిపడుతూ సదరు వ్యక్తికి సపోర్ట్ గా కామెంట్ చేస్తున్నారు.







