సచిన్ ని విమర్శించి విమర్శల పాలైన పాండ్య.. అభిమానుల ఆగ్రహం!

స్టార్ క్రికెటర్ హార్దిక్‌ పాండ్య( Hardik Pandya ) గురించి తెలియని క్రికెట్ ప్రేమికులు ఉండనే వుండరు.

ఈ నేపథ్యంలోనే ఈ మధ్య మనోడు తరచూ వార్తల్లోకెక్కుతున్నాడు.

అవును, ఈ ఐపీఎల్ 2024( IPL 2024 ) సీజన్ అంతగా కలిసి రావడం లేదనే చెప్పుకోవాలి.పాండ్య గుజరాత్ టైటాన్స్‌తో 2 విజయవంతమైన సీజన్లు ఆడిన తర్వాత, ముంబై ఇండియన్స్‌కి( Mumbai Indians ) కెప్టెన్‌గా తిరిగి వచ్చాడు.

ఇది చాలా మంచి మార్పు అనుకుంటే ఈ సీజన్‌లో వారు చాలా దారుణంగా ఆడుతున్నారు.దాంతో సహజంగానే పాండ్య మీద ఒత్తిడి పెరిగింది.

కొంతమంది ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ( Rohit Sharma ) స్థానంలో పాండ్య రావడంతో గుర్రుగా వున్నారు.కాగా ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది.

Advertisement

అవును, హార్దిక్‌ పాండ్య కెప్టెన్‌గా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.దాంతో అతని కెప్టెన్సీలో టీమ్ పాయింట్ల పట్టికలో అట్టడుగున స్థానానికి పడిపోయింది.

ఇక ఈ క్రమంలో పాండ్య మీద తీవ్రస్థాయిలో విమర్శలు పెరిగాయి.ఈ నేపథ్యంలో అతనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం పెను దుమారాన్ని సృష్టిస్తోంది.ఈ వీడియో కారణంగా అభిమానులు పాండ్యని మరింత ఏకిపారేస్తున్నారు అనే చెప్పుకోవాలి.

కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్‌ పాండ్య రావడం నచ్చక చాలా మంది అభిమానులు అయితే బాహాటంగానే వారి కోపాన్ని సోషల్ మీడియాలో వెళ్లగక్కుతున్నారు.ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్‌తో( Gujarat Titans ) జరిగిన మొదటి మ్యాచ్‌లో పాండ్యకి అహ్మదాబాద్‌లో అభిమానులు నుంచి చాలా వ్యతిరేకత ఎదురైంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా హైదరాబాద్‌లో ఫ్యాన్స్ హార్దిక్‌ని దూషించారు.

K.K. Senthil Kumar : ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్.. అతడు షాట్ తీస్తే వెండితెరకు అతుక్కుపోవాల్సిందే..

పాండ్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఒక వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.విషయం ఏమిటంటే ఆ వీడియోలో పాండ్య మ్యాచ్ ప్రారంభానికి ముందు సచిన్ టెండూల్కర్‌ని( Sachin Tendulkar ) ఇగ్నోర్ చేసినట్లు చాలా స్పష్టంగా కనబడుతోంది.టెండూల్కర్ ఈ సీజన్‌లో ముంబై సపోర్ట్ స్టాఫ్‌లో ఒక భాగం.

Advertisement

వీడియోలో సచిన్ ప్రధాన పిచ్ వైపు నడుస్తున్నప్పుడు, పాండ్య దాని పక్కన ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఇక్కడ కనబడుతుంది.సచిన్‌తో కలిసి పిచ్ చూడటానికి సదరు ముంబై ఇండియన్ టీమ్‌ కెప్టెన్ కొంచెం కూడా ఆసక్తి చూపకపోవడం కొసమెరుపు.

అదే సమయంలో, రోహిత్ శర్మ ప్రధాన పిచ్ దగ్గర సచిన్‌ని చూసి, అతని వద్దకు వెళ్లి, ఆట స్థలం గురించి చర్చించడం కనిపించింది.దాంతో టీమ్‌ని గెలిపించడం చేతకాదు కానీ ఆటిట్యూడ్ చూపించడానికి పాండ్య ముందుంటాడు అని చాలామంది ఫ్యాన్స్ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజా వార్తలు