ప్రముఖ కన్నడ నటుడు, మాజీమంత్రి అనంత్ నాగ్ బీజేపీలో చేరనున్నారు.గత కొన్ని రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన తాజాగా కాషాయకండువా కప్పుకోనేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.కాగా గతంలో జెహెచ్ పటేల్ హయాంలో అనంత్ నాగ్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు.2004లో చామరాజ్ పేట నుంచి జేడీఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైయ్యారు.ఆ తరువాతి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.మరోవైపు అనంత్ నాగ్ 1973 నుంచి కన్నడతో పాటు పలు భాషల్లో మొత్తం 196 సినిమాలలో నటించారు.







