ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్( Bigg Boss ) లో తానూ చేసిందే కరెక్ట్, తానూ ఏది చెప్తే అందరూ అదే అనుసరించాలి, లేకపోతే వాళ్ళ మీద విషం కక్కుతా అనే ధోరణితో వ్యవహరిస్తున్న కంటెస్టెంట్ ఎవరూ అంటే అది శివాజీ ( Shivaji )అనే చెప్పాలి.ఈయన హౌస్ లోకి అడుగుపెట్టకముందే కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే, మంచి పాపులారిటీ ఉన్న హీరో, అలాగే రాజకీయ సంబంధాలు కూడా ఎక్కువే ఉన్నాయి.
అందుకే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తొలుత శివాజీ కి ఎవ్వరూ ఎదురు చెప్పేవాళ్ళు కాదు.కానీ అమర్ , గౌతమ్, ప్రియాంక వంటి వారు శివాజీ చేసే తప్పులను, చేస్తున్న గుంట నక్క వేషాలను నిలదీస్తూనే వస్తున్నారు.
అందుకే శివాజీ కి ఈ ముగ్గురు అంటే అసలు పడదు.తనకి వాళ్ళ మీద ఉన్న పగ ఎలాంటిదో ఈ వారం కెప్టెన్సీ టాస్కు విషయం లో అందరికీ అర్థం అయిపోయింది.

ఇక పోతే నిన్నటి ఎపిసోడ్ లో అమర్ దీప్ ని నాగార్జున అడిగిన ప్రశ్నలు, శివాజీ తనకి వేసిన వెన్ను పోటు గురించి చాలా బలమైన స్వరం తో వినిపించాడు.అందరికీ ఇది శబాష్ అనిపించింది.సపోర్టు చేస్తానని చెప్పి ఎందుకు అమర్ కి సపోర్ట్ చెయ్యలేదు అని నాగార్జున( Nagarjuna ) అడగగా, దానికి శివాజీ సమాధానం ఇస్తూ కెప్టెన్ అయితే డిప్యూటీస్ గా ఎవరిని పెట్టుకుంటావ్ రా అని అడిగాను, దానికి వాడు శోభా, ప్రియాంక ని పెట్టుకుంటా అన్నాడు, మళ్ళీ సేఫ్ గేమ్ నడుస్తుంది మారే అవకాశమే లేదు అని అనుకోని నేను అర్జున్ కి సపోర్ట్ చేశాను.అప్పుడు అమర్ దానికి సమాధానం చెప్తూ, ఈ విషయం లో నాకు ఆదర్శం ఆయనే సార్, ఆయన కెప్టెన్ అయ్యినప్పుడు ప్రశాంత్, యావర్ ని ఎలా పెట్టుకున్నాడో, మేము కూడా అంతే సార్, మాకు కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వమని చెప్పి, ఆయన మాత్రం ఎందుకు సార్ కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడు అని నిలదీసాడు, దీంతో దెబ్బకి శివాజీ ముఖం వాడిపోయింది.

శుక్రవారం జరిగిన ఎపిసోడ్ శివాజీ కి బాగా నెగటివ్ అయ్యింది అనే విషయాన్నీ గమనించి, శనివారం నుండి చెయ్యి నొప్పి సింపతీ డ్రామాని మొదలు పెట్టాడు.కానీ నాగార్జున ముందు అమర్ తో జరిగిన సంభాషణ శివాజీ స్ట్రాటజీ ని విఫలం చేసింది.ఫలితంగా ఓటింగ్ లో ఎలాంటి మార్పు లేదు.టాప్ 3 కంటెస్టెంట్స్ గా శివాజీ, ప్రశాంత్ మరియు అమర్ నిలుస్తారని అందరూ అనుకున్నారు.కానీ శివాజీ ఇప్పుడు ఈ ముగ్గురిలో అతి తక్కువ ఓట్లతో కొనసాగుతున్నాడు.ఆయన ఇదే ధోరణితో వ్యవహరిస్తే మాత్రం రాబొయ్యే రోజ్జుల్లో 5 వ స్థానం కి పడిపోయే ఛాన్స్ కూడా ఉంది.