క్రికెట్ ఆడుతున్న మోదీ.. వైరల్ అవుతున్న వీడియో.. కానీ అసలు ట్విస్ట్ అదే!

ప్రధాని నరేంద్ర మోదీ క్రికెట్ ఆడుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఈ వీడియోని పలువురు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేస్తున్నారు.

అయితే ఈ వీడియోలో ఒక ట్విస్ట్ ఉంది.అదేంటంటే ఈ వీడియోలో క్రికెట్ ఆడుతున్న వ్యక్తి నిజంగా నరేంద్ర మోదీ కాదు.

ఈ వీడియో క్లిప్‌లో దృశ్యాలను కొంచెం అస్పష్టంగా చేసి ఫిల్టర్‌ని ఉపయోగించినట్లు మీరు గమనించవచ్చు.దీని స్క్రీన్‌షాట్ తీసి గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే అదే క్లిప్ చాలా చోట్ల కనిపిస్తుంది.

యూట్యూబ్ లింక్‌లు కూడా కనిపిస్తాయి.ఈ వీడియోల టైటిల్స్ కూడా “నరేంద్ర మోదీ క్రికెట్‌ ఆడుతున్నారు” అని కనిపిస్తుంది.

Advertisement

ట్విట్టర్‌లో కూడా ఈ వీడియో వైరల్ గా మారింది.దీన్ని చూసిన చాలామంది నెటిజన్లు నిజంగానే మోదీ క్రికెట్ ఆడుతున్నారా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే బాగా సెర్చ్ చేయగా ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ప్రధాని మోదీ కాదని, క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ అని తేలింది.ఈ వీడియో యోగరాజ్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తొలిసారిగా పోస్ట్ అయింది.

మార్చి 14న యోగరాజ్ సింగ్ షేర్ చేసిన అసలు వీడియోని మీరు చూడొచ్చు.“మీరు గేమ్‌లు ఆడితే జీవితం మరింత సరదాగా ఉంటుంది.

క్రికెట్ నా ప్యాషన్.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
వైరల్: 20 సంచుల నిండా నాణేలతో కోర్టుకెళ్లిన వ్యక్తి... అందరూ షాక్!

మీ ఆట ఏంటి?” అని యోగరాజ్ వీడియో క్లిప్‌కు క్యాప్షన్ రాయడం కూడా చూడొచ్చు.అయితే వైరల్ అవుతున్న వీడియో క్లారిటీగా లేకపోవడంతో అందులో ఉన్నది నరేంద్ర మోదీ అని చాలామంది పొరపాటు పడుతున్నారు.యోగరాజ్ లుక్ కూడా కాస్త మోదీ లాగానే ఉండటంతో ప్రధాని క్రికెట్ ఆడారేమోనని కొందరు నమ్మేస్తున్నారు.

Advertisement

వారందరికీ ఒరిజినల్ వీడియో పూర్తి స్థాయిలో క్లారిటీ ఇస్తోంది.ఈ వీడియోని మూడు కూడా చూసేయండి.

తాజా వార్తలు