సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ పై ఎప్పటినుండో వార్తలు, విమర్శలు వినపడుతూనే ఉన్నాయి.బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలాంటి న్యూస్ లు చాలానే చూసాం.
ఇటీవల కాలంలో శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి కొందరిని టార్గెట్ చేస్తూ వారిని సాక్ష్యాధారాలతో సహా బట్టబయలు చేసింది.ఇది వివాదాస్పదంగా మారింది అది వేరే విషయం అనుకోండి.
అయితే చాలా మంది కథానాయకులు కొందరు నటులు కూడా ఇది నిజమేనని తాము కూడా ఇలాంటి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాము అని చెప్పుకొచ్చారు.హీరోయిన్ లపై చిన్న చూపు ఉందని, వారు ఎదగాలి అంటే సినీ రంగంలో కొందరి ప్రముఖుల కోరికలు తీర్చాల్సిందే అని పలువురు స్టార్ హీరోయిన్ లు కూడా ఇండస్ట్రీ పై ఆరోపణలు చేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి.
అయితే ఇందుకు సంబంధించి దగ్గరగా ఉండే ఒక సీన్ తన సినిమాలో చూపిస్తూ అలాంటి దర్శకులు కళ్ళు ఇకనైనా కళ్ళు తెరవాలి అన్నట్లుగా టార్గెట్ చేశారు డైరెక్టర్ కృష్ణ వంశీ. రొటీన్ కథే అయిన దానికి ట్రెండ్ కు తగ్గట్టుగా హంగులు దిద్ది సరికొత్తగా ప్రజెంట్ చేయడంలో దిట్ట డైరెక్టర్ కృష్ణ వంశీ.
ఈయన ప్రతి సినిమా ఇదే తరహాలో ప్రత్యేకతను సంతరించుకుంటుంది.అలాగే ఈయన టేకాఫ్ చేసిన ఖడ్గం సినిమా కూడా చాలా చాలా స్పెషల్.దేశభక్తిని చాటి చెప్పే ఈ చిత్రంలో కాస్టింగ్ కౌచ్ పై కూడా ఒక సీన్ డిజైన్ చేశారు.
ఈ సినిమాలో నటి సంగీత పెద్ద హీరోయిన్ కావాలనే ఆశతో ఇండస్ట్రీకి వస్తుంది.అయితే తన సినిమాలో అవకాశం కావాలంటే తన కోరిక తీర్చాల్సిందే అని కండిషన్ పెడతాడు ఆ డైరెక్టర్.అయితే అందుకు సంగీత ఒప్పుకోకపోయినా ఆమె తల్లి (పావలా శ్యామల) కూతురికి నచ్చ చెప్పి ఈ ఒక్కటి దాటేస్తే పెద్ద హీరోయిన్ అవుతావు అంటూ బలవంతంగా ఆ డైరెక్టర్ గదికి పంపిస్తుంది.
కట్ చేస్తే అదే టైం కి హీరో రవితేజ ఆ రూమ్ లోకి వెళ్లి వారిని అలా చూసి షాక్ అవుతాడు.అయితే ఇక్కడ ఈ సీన్ కల్పితం కాదని ఒక డైరెక్టర్ ను ఉద్దేశించే ఈ సన్నివేశాన్ని తన సినిమాలో కృష్ణ వంశీ చూపించారని ఇండస్ట్రీలో టాక్.
అదీకాక ఆ సీన్ లో దర్శకుడు పాత్రలో ఉన్న నటుడు ఆ డైరెక్టర్ కి దగ్గర పోలికలు ఉండటంతో అప్పట్లో వార్తలు వెల్లువెత్తాయి.ఇంతకీ అది జరిగింది మరే హీరోయిన్ కో కాదట రమ్య కృష్ణకే అని సమాచారం.దానికి తోడు ఆ తర్వాత ఓ సారి నటి రమ్య కృష్ణ కూడా ఒక నటికి వరుస అవకాశాలు అందాలి అన్నా, స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకోవాలి అన్నా దర్శక, నిర్మాతల గదుల్లోకి వెళ్ళాల్సిందే అని షాకింగ్ కామెంట్స్ చేశారు.అయితే కృష్ణ వంశీ తన చిత్రాలతో ఎంటర్టైన్ చేస్తూనే రియాలిటీని ప్రేక్షకులకు ముందుంచాలి అనుకునే దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.