సూర్యభగవానుడిని విమలాదిత్యునిగా ఎందుకు పూజిస్తారో తెలుసా..?

సమస్త ప్రపంచానికి జీవనాధారమైన ఆ సూర్యభగవానుడికి, భానుడు, రవి వంటి వివిధ రకాల పేర్లతో పిలవడం గురించి మనం విన్నాం.

కానీ సూర్య భగవానుడి విమలాదిత్యుడు అనే పేరుతో కూడా పిలుస్తారు.

అయితే ఈ విమలాదిత్యుని ఆలయం పరమశివుడు సృష్టించిన కాశీ నగరంలో కొలువై ఉంది.కాశీలో వెలసిన ఈ క్షేత్రాలను దర్శిస్తే అష్టదరిద్రాలు తొలగిపోతాయి, మరి జన్మంటూ ఉండదని ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారు.

అందుకే మరణించే లోపు ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని దర్శించి గంగానదిలో స్నానం చేయాలని చెబుతుంటారు.పరమపవిత్రమైన కాశీలో మనకు 12 సూర్య దేవాలయాలు కనిపిస్తాయి.

ఈ పన్నెండు ఆలయాలలో ఒక్కో ఆలయం వెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని ఒక్కో పేరుతో పిలువబడుతూ పూజిస్తుంటారు.

Advertisement
Facts Behind Surya Bhagavan Temple In Varanasi , Varanasi, Sun God, Ganga River,

ఇందులో ఒకటిగా ప్రసిద్ధి చెందినదే విమలాదిత్యుని ఆలయం.అసలు ఈ ఆలయంలో వెలసిన స్వామి వారికి విమలాదిత్యుడు అనే పేరుతో ఎందుకు పిలుస్తారు, ఆలయ చరిత్ర ఏమిటో తెలుసుకుందాం.

Facts Behind Surya Bhagavan Temple In Varanasi , Varanasi, Sun God, Ganga River,

పూర్వం విమలుడు అనే ఒక రాజు కుష్టి వ్యాధితో బాధపడుతూ ఉండేవారు.ఈ వ్యాధితో ఎంతో విరక్తి చెందిన రాజు తన భార్యా బిడ్డలను వదిలి కాశీకి చేరుకున్నాడు.కాశీలో విమలుడు ఆదిత్యుని రూపాన్ని ప్రతిష్టించి భక్తితో పూజలు చేసేవాడు.

తన తపస్సుకి మెచ్చిన సూర్యభగవానుడు ప్రత్యక్షమై విమలుడికి కుష్టి వ్యాధిని నయం చేశాడు.అదే విధంగా విమలుడు ప్రతిష్టించిన ఆదిత్య విగ్రహం ఇప్పటి నుంచి విమలాదిత్యునిగా పూజలందుకుంటాడని చెబుతారు.

ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, బాధలు, దారిద్య దుఖాలు ఉంటాయో అలాంటి వారు విమలాదిత్యుని పూజించడం వల్ల వారి బాధలు, దరిద్రం తొలగిపోతుందని తెలియజేస్తాడు.అందువల్ల కాశీ క్షేత్రానికి వెళ్లిన భక్తులు తప్పకుండా విమలాదిత్యుని ఆలయాన్ని దర్శించుకుని వెళ్తారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు