Director Puri Jagannadh: పూరి జగన్నాధ్ ప్రతి అభిమాని తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే !

ఎవరైనా సాధారణం గా 56 ఏళ్ళ వయసులో ఉద్యోగం చేస్తూ ఉంటె పక్కాగా రిటైర్మెంట్ టైం.

కానీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏజ్ తో సంబంధం లేదు.

కేవలం ట్యాలెంట్ ఉంటే చాలు ఎన్ని ఏళ్లయినా హ్యాపీగా పని చేసుకోవచ్చు.మరి ప్రస్తుతం 56వ పుట్టిన రోజు జరుపుకుంటున్న పూరి జగన్నాధ్( Director Puri Jagannadh ) గారు కూడా అంతే.

ఎన్ని సార్లు పడిపోయామన్నది ముఖ్యం కాదు అన్నయ్య మళ్లీ లేచి గెలిచామా లేదా అనేదే ముఖ్యం అంటూ ఉంటారు.అందుకే అయన పూరి ఎన్ని సార్లు పడిన కూడా లేస్తూనే ఉంటారు.2000 సంవత్సరం లో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి ఈ 23 ఏళ్లలో 35 సినిమాలు తీయడం అంటే మాములు విషయం కాదు.అయన సమకాలికులు ఎవరు కూడా అన్ని సినిమాలు తీయలేదు.

అలాగే ఇక ముందు వచ్చే వారు కూడా చేస్తారు అనుకోలేము.

Advertisement

చాల మంది హీరోయిన్స్ ని వెండి తెరకు పరిచయం చేస్తే ఒక్క ఛార్మి( Charmi ) మినహా ఆయనపై హీరోయిన్స్ తో ఎలాంటి పుకార్లు పుట్టించి వార్తలు రాయలేదు.అనుష్క,( Anushka ) కంగనా,( Kangana ) ప్రియమణి, ఇలియానా వంటి వారిని స్టార్ హీరోయిన్స్ చేసారు.దాదాపు రవి తేజ ను నిలబెట్టింది కూడా పూరి అని చెప్పాల్సిందే.

మహేష్ బాబు కి( Mahesh Babu ) కెరీర్ మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ కూడా పూరి వల్లే సాధ్యం అయ్యింది.ఇక మ్యూజిక్ పరంగా, రఘు కుంచె, చక్రి, కౌసల్య వంటి వారిని ఎన్నోసార్లు రిపీట్ చేసి హిట్స్ అందుకున్నాడు.

చాల వేగంగా సినిమాలు తీయడం లో ఆయనకు ఆయనే సాటి.ఇక తాను సొంతంగా తీసిన సినిమాలు ప్లాప్ అయ్యి రోడ్ మీదకు వచ్చిన ఏమాత్రం కుంగిపోకుండా కుటుంబాన్ని కప్పుకొని మళ్లి హిట్ కొట్టి తానేంటో నిరూపించుకున్నాడు.ఇక ఆడియో ఫంక్షన్స్ లో ఏది పడితే ఆది వాగే టైపు కాదు.

బ్లూ లేదా బ్లాక్ డ్రెస్ వేసుకొని తన సినిమాకు ఏం కావాలో అదే మాట్లాడే మనిషి.ఇక సినిమాలో అనవసరమైన శృంగారం కానీ, అక్కర్లేని హడావిడి కానీ ఎక్కడ ఉండదు.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

చెప్పాల్సిన విషయాన్ని సూటిగా, సుత్తి లేకుండా చెప్పేయడం ఆయనకు బాగా అలవాటు.

Advertisement

తాజా వార్తలు