చిత్ర పరిశ్రమలో ఆయనో గొప్ప రచయిత.. ప్రశ్నించే దమ్మున్న ఏకైక వ్యక్తి

ఎం.ఎస్‌.రెడ్డి( M.

S.Reddy ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన పూర్తి పేరు మల్లెమాల సుందరరామిరెడ్డి.

( Mallemala Sundara Ramireddy ) కవిగా, గేయ రచయితగా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు ఎం.ఎస్‌.రెడ్డి.

ఆయన రచనలు, సినిమాలు చాలామందిని ఇన్‌స్పైర్‌ చేశాయి.దేన్నైనా ఆయన సూటిగా మాట్లాడగలరు.

తప్పు చేస్తే ప్రశ్నించే ధైర్యం, తెగువ ఆయన సొంతం.ఎమ్మెస్ రెడ్డి బతికి ఉన్నప్పుడు ‘ఇది నా కథ’ ( Idi Naa Katha ) పేరిట ఆటో బయోగ్రఫీ రాశారు.

Advertisement

దీనివల్ల ఆయన చాలా విమర్శలు ఫేస్ చేశారు.ఎందుకంటే సినీ జీవితంలో జరిగిన కొన్ని విషయాలను ఆయన ఉన్నది ఉన్నట్టే రాశారు.

కొందరి గురించి ఆయన ఉన్నది ఉన్నట్లు రాయడం వల్ల వాళ్లు హర్ట్ అయ్యారు.అందుకే విమర్శించారు.

అయితే ఆయన ఎవరూ విమర్శించినా భయపడలేదు అప్పట్లో జరిగినవే నిర్భయంగా రాశానని తనను తాను సమర్ధించుకున్నారు.

ఎం.ఎస్‌.రెడ్డి చనిపోయే వరకు ఇలాంటి ధోరణితోనే బతికారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్ట్17, శనివారం 2024
అల్లు వారి పిల్లలతో మెగాస్టార్ చిరంజీవి... వివాదాలు తొలగిపోయినట్టేనా?

మొదటగా నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నారు.కవిగా, నిర్మాతగానే సక్సెస్ అయిన తర్వాత నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.

Advertisement

ఈ సినీ యాక్టర్ కలం పేరు మల్లెమాల.( Mallemala ) ఈ పేరుతో కవితలు, సినీ గేయాలు రాస్తూ ప్రజలకు బాగా దగ్గరయ్యారు.ఆయన రాసిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

ముఖ్యంగా ‘తెల్లా వారకముందే పల్లే లేచింది.తన వారినందరినీ తట్టీ లేపింది.

’, ‘సన్నాజాజికి, గున్నామావికి పెళ్లి కుదిరింది.’, ‘సంగమం.

సంగమం.అనురాగ సంగమం’ వంటి సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్ అయ్యాయి.

ఈ టాలెంటెడ్ రైటర్ ఏకంగా 5,000 వరకు కవితలు, సినిమా సాంగ్స్ రాసి తన సత్తా చాటారు.కౌముది ఆర్ట్స్‌ బేనర్‌ స్థాపించి శ్రీకృష్ణ విజయం, ఊరికి ఉపకారి, కోడెనాగు, పల్నాటి సింహం వంటి సినిమాలు తీయడం ద్వారా ప్రొడ్యూసర్‌గా అవతరించారు.

ఎమ్మెస్ రెడ్డి తన కుమారుడు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి( Shyam Prasad Reddy ) సమర్పణలో తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అరుంధతి వంటి సూపర్‌హిట్‌ సినిమాలను ప్రొడ్యూస్ చేసి బాగా లాభాలు అందుకున్నారు. ‘రామాయణం’ చిత్రాన్ని( Ramayanam ) ఎం.ఎస్‌.రెడ్డి ప్రొడ్యూస్ చేశారు దీని ద్వారానే జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) సినిమా పరిశ్రమకు పరిచయమయ్యాడు.

ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, పాటలు, పద్యాలు ఆయనే రాశారు.ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది.రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు కూడా వరించింది.

అంకుశం సినిమాలో మంచి పాటలు రాసినందుకుగాను బెస్ట్ లిరిసిస్ట్ గా నంది అవార్డు కైవసం చేసుకున్నారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది.

ఎమ్మెస్ రెడ్డి సినిమాల ద్వారా లాభాలు బాగా సంపాదించాలని అనుకునే వారు కాదు.ప్రజలకు ఏదో ఒక సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతోనే సినిమాలు చేసేవారు.

ఏదైనా సినిమా నచ్చితేనే దానికి పాటలు రాసేవారు.

తాజా వార్తలు