రేపు తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఇద్దరు నేతలకు చోటు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

ఈ క్రమంలోనే పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సీఎం కేసీఆర్ కేబినెట్ ను పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది.

మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఇద్దరు నేతలకు చోటు దక్కనుందని సమాచారం.ఈటల రాజేందర్ ఉద్వాసనతో ఓ స్థానం ఇప్పటికే ఖాళీగా ఉండగా మరో మంత్రికి ఉద్వాసన పలికే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ క్రమంలో ఆ స్థానాలను భర్తీ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.ఈటల స్థానంలో మాజీమంత్రి మహేందర్ రెడ్డికి చోటు కల్పించనున్నారని తెలుస్తోంది.

ఈ మేరకు రేపు రాజ్ భవన్ లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం.

Advertisement
ఇదేం శ్యాడిజం.. స్కూటీని ఢీ కొట్టడమే కాకుండా అమాంతం ఈడ్చుకెళ్లిన కారు..

తాజా వార్తలు