టాలీవుడ్ లో యాక్షన్ సినిమాలు అనగానే గుర్తుకు వచ్చే పేరు బోయపాటి శ్రీను.ఈయన ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు.
భద్ర వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో దర్శకుడిగా మారిన బోయపాటి అప్పటి నుండి వరుసగా యాక్షన్ ఎంటెర్టైనమెంట్స్ ను తెరకెక్కిస్తూ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ కెరీర్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.ఇక బోయపాటి బాలయ్యతో అఖండ వంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న తర్వాత ఇప్పుడు ఇష్మార్ట్ శంకర్ రామ్ పోతినేని తో నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసాడు.RAPO20 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే రెగ్యురల్ షూట్ స్టార్ట్ అయ్యింది.శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి తన బ్యానర్ శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ పై భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు.
ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బోయపాటి తెరకెక్కిస్తుండడం విశేషం.మరి ఇటు బోయపాటికి అటు రామ్ కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై ఈ ఇద్దరు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో రామ్ క్యారెక్టర్ గురించి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
ఇందులో రామ్ డబల్ రోల్ చేస్తున్న విషయం విదితమే.
మరి ఈ రెండు వేరియేషన్స్ గురించి ఇప్పుడు అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్స్ లో ఫుల్ రగ్గడ్ అండ్ రఫ్ లుక్ లో రామ్ కనిపించ నున్నాడు అని కొన్ని సీన్స్ లో అయితే పక్కా తాగుబోతు పాత్రగా రామ్ పాత్ర సాగుతుంది అని టాక్ వచ్చింది.మరి బోయపాటి సినిమాలు అన్నిటిలో ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లు ఉంటూనే ఉంటాయి.
ఈ సినిమా కూడా ఈయన మార్క్ లో ఉంటుంది అని తెలుస్తుంది.చూడాలి బోయపాటి రామ్ ఆశలను నిలబెడతాడో లేదో.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy