అమెరికా: టోర్నడో హెచ్చరిక.. అయోవాలో ర్యాలీని రద్దు చేసుకున్న డొనాల్డ్ ట్రంప్

2024 అమెరికా అధ్యక్ష బరిలో నిలిచినట్లు రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) ప్రకటించిన సంగతి తెలిసిందే.దీంతో ఆయన ప్రచార కార్యక్రమాలను ఇప్పటి నుంచే మొదలుపెట్టారు.

 Ex Us President Donald Trump Cancels Iowa Rally Over Tornado Threat Details, Ex-TeluguStop.com

అలాగే నిధుల సమీకరణలోనూ చురుగ్గా పాల్గొంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.దేశవ్యాప్తంగా ర్యాలీల్లో పాల్గొంటూ మద్ధతును కూడగడుతున్నారు డొనాల్డ్ ట్రంప్.

అయితే ప్రతికూల వాతావరణం, టోర్నడో హెచ్చరికల నేపథ్యంలో శనివారం సాయంత్రం అయోవాలో( Iowa ) జరగాల్సిన ర్యాలీని ట్రంప్ రద్దు చేసుకున్నారు.శనివారం మధ్యాహ్నం నాటికి అయోవా తూర్పు, పశ్చిమాల దిశగా టోర్నడో ( Tornado ) కదలికలు వున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Telugu America, Donald Trump, Iowa, Iowa Tornado, Severe, Tornado Threat, Trump

ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ అయోవాలో జరగాల్సిన ర్యాలీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.తాను పామ్ బీచ్ విమానాశ్రయ సమీపంలో … ప్రయాణానికి సిద్ధంగా వున్నానని చెప్పారు.

కానీ అయోవాలో ప్రతికూల వాతావరణం కారణంగా తాము పర్యటనను రద్దు చేసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.టోర్నోడో నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా వుండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆయన సూచించారు.

Telugu America, Donald Trump, Iowa, Iowa Tornado, Severe, Tornado Threat, Trump

ఇకపోతే.అమెరికాలో దాదాపు పదిహేను మిలియన్ల మందిపై టోర్నడో ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ తెలిపింది.ఇప్పటికే గురు, శుక్రవారాల్లో రెండు డజన్లకు పైగా టోర్నడో ఘటనలు నమోదయ్యాయి.ఎక్కుగా పశ్చిమ కాన్సాస్, సెంట్రల్ ఓక్లహోమా నగరాలపై టోర్నడో ప్రభావం కనిపించింది.ఓక్లహోమా నగరానికి దక్షిణంగా 30 మైళ్ల దూరంలో వున్న నోబెల్ తదితర ప్రాంతాల్లో టోర్నడో కారణంగా నష్టం కలిగిందని వార్తలు వస్తున్నాయి.అటు తూర్పు నెబ్రాస్కా, సౌత్ డకోటా, అయోవా పరిసర ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం, సాయంత్రం టోర్నడోలు తాకాయి.

డల్లాస్ , టెక్సాస్, కాన్సాస్ సిటీ, మిస్సౌరీ, డెస్ మోయిన్స్ నగరాల్లోనూ భారీ ఈదురుగాలులు వీచాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube