ప్రస్తుత రాజకీయాల్లో చాలా మంది నేతలు అవినీతికి పాల్పడే వారే ఎక్కువగా ఉన్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు.ఎవరికీ వారు కుంభకోణాలకు పాల్పడుతూ పక్కవారిపై నిందలు వేయడం పరిపాటిగా మారిపోయింది.
ఈ తరహా నేతలు టీడీపీకి చెందిన వారని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.మాజీ మంత్రి పొంగూరు నారాయణ( Ponguru Narayana ) అవినీతి, అక్రమాలపై పలు విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీలో రాజధాని ఏర్పాటు ముసుగులో ల్యాండ్ పూలింగ్ లో అక్రమాలతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్ లో జరిగిన అవకతవకల్లో నారాయణ ఏ2 గా ఉన్నారన్న సంగతి తెలిసిందే.అంతేకాదు నారాయణ విద్యాసంస్థల్లోనూ ఎన్నో అక్రమాలు బయటకు వచ్చినప్పటికీ టీడీపీ నేతలకు కానీ, ఆ పార్టీకి కొమ్ముకాసే వారికి కానీ కనిపించకపోవడం శోచనీయం.
గతంలోని టీడీపీ ప్రభుత్వ హయాంలో నారాయణ చేసిన అవినీతి, అక్రమాలు లీక్ అయ్యాయని తెలుస్తోంది.అది కూడా నారాయణకు అత్యంత ఆప్తుడు, నారాయణ విద్యాసంస్థల గ్రూప్ జనరల్ మేనేజర్ గా వ్యహారిస్తున్న విజయ భాస్కర్ రెడ్డి( Vijaybhaskar Reddy ) ద్వారా వివరాలు బయటకు వచ్చాయని తెలుస్తోంది.నారాయణ అక్రమ ఆస్తులతో పాటు భూముల వివరాలను విజయభాస్కర్ రెడ్డి బయట పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే.టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu )కు నారాయణ అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన సంగతి ఏపీ ప్రజలందరికీ తెలిసిన విషయమే.టీడీపీ ఆర్థిక వ్యవహారాలను ఆయనే చక్కబెడుతుండేవారు.
ఈ క్రమంలోనే ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేకున్నా 2014 లో టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టారట.పార్టీలో ఎందరో సీనియర్ నేతలు ఉన్నప్పటికీ వారందరినీ కాదని నారాయణను మినిస్టర్ చేయడంపై అప్పటిలో సంచలనం సృష్టించింది.
తాజాగా మాజీ మంత్రి నారాయణ అక్రమాలు బయటకు వచ్చాయంటూ చక్కర్లు కొడుతున్న వార్త ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిందని తెలుస్తోంది.