జగన్ మంత్రి పదవి తొలగించి మంచి పని చేశారు - మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.జగన్ మంత్రి పదవి నుంచి తొలగించి మంచి పనిచేశారని వ్యాఖ్యానించారు.

పదవి పోయిన తర్వాత ఎవరు తనతో వున్నారో.ఎవరు వుండరో అర్ధమైందని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.పలువురు కార్పోరేటర్లు తనను వీడినా బాధపడనని.2014లో బలమైన వర్గానికి చెందిన మేయర్‌తో పాటు పలువురు కార్పోరేటర్లు తనను విడిచిపెట్టారని అనిల్ కుమార్ గుర్తుచేశారు.

Ex Minister Anil Kumar Yadav Shocking Comments On Removing From Minister Post De

ఇప్పుడు తనను ఎందుకు వీడారో అర్ధం కాలేదన్నారు.తనను వీడినవాళ్లు అనిల్ అన్యాయం చేశాడా.అని ఒక్కసారి ప్రశ్నించుకోవాలని సూచించారు. తన ప్రత్యర్ధి రూ.180 కోట్లు ఖర్చు పెట్టినా తానే గెలిచానని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.ఆర్య వైశ్య సంఘం కార్యక్రమంలో అందరూ రూ.100 కోట్లు పైబడి ఆస్తులు వున్నవారు వున్నారని ఆయన తెలిపారు.వేదిక మీద అంతా వెయిట్ వున్నవాళ్లు వున్నారని.

Ex Minister Anil Kumar Yadav Shocking Comments On Removing From Minister Post De

తనకు వెయిట్ లేదని తనను పిలవలేదేమో అంటూ అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.తన రాజకీయ జీవితంలో పోట్లు కొత్త కాదని ఆయన అన్నారు.రాజకీయ జీవితంలో కొంతమంది కలుస్తారు.

Advertisement
Ex Minister Anil Kumar Yadav Shocking Comments On Removing From Minister Post De

కొంతమంది వెళ్తారని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.వచ్చే ఎన్నికలు తనకు చాలా కష్టం అంటున్నారని.

తాను ఎవరికీ అన్యాయం చేయలేదని ఆయన అన్నారు.ప్రజలే తన వెంట వున్నారని అనిల్ చెప్పారు.

 .

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు