పోస్టల్ బ్యాలెట్ తరువాత ఈవీఎం బ్యాలెట్ లెక్కింపు.. ఏపీ సీఈవో

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా( Mukesh Kumar Meena) కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుందని సీఈవో ముకేశ్ కుమార్ మీనా పేర్కొన్నారు.ఈ క్రమంలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారన్న ఆయన తరువాత ఈవీఎం బ్యాలెట్ లెక్కిస్తారని తెలిపారు.

మొత్తం 119 మంది పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిందన్న ఆయన ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామని వెల్లడించారు.పార్లమెంట్ కు 13 రౌండ్లు ఉంటాయని, ఐదు గంటల్లో కౌంటింగ్ పూర్తవుతుందన్నారు.

ఈవీఎం కౌంటింగ్ లో ప్రతి రౌండ్ కు 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుందని తెలిపారు.కౌంటింగ్ కేంద్రాల లోపల అవాంతరాలు సృష్టించే వారిని బయటకు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
How Modern Technology Shapes The IGaming Experience

తాజా వార్తలు