పంచముఖ నరసింహస్వామి దేవాలయం గురించి ఎప్పుడైనా విన్నారా..?

సాధారణంగా మన పంచముఖ ఆంజనేయుడు గురించి ఎన్నో సందర్భాలలో వినే ఉంటాం.కానీ పంచముఖ నరసింహ స్వామి గురించి ఎప్పుడైనా విన్నారా? అలాంటి దేవాలయాలను ఎక్కడైనా దర్శించారా? అయితే ఈ విధంగా నరసింహ స్వామి పంచముఖ రూపాలలో దర్శనమిచ్చే ఆలయం గురించి మనం తెలుసుకుందాం.

సాధారణంగా నరసింహ స్వామి మనకు ఐదు రూపాలలో దర్శనమిస్తాడు.

అవి జ్వాల నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, యోగా నరసింహుడు, గండ భేరుండ నరసింహుడు.ఈ విధంగా ఐదు రూపాలలో ప్రత్యేకంగా మనకు దర్శన భాగ్యం కల్పిస్తారు.కానీ పంచ ముఖాలు కలిగి దర్శనం కల్పించే టటువంటి నరసింహస్వామి ఆలయ విశేషాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో నర్శింపల్లి అనే గ్రామంలో శ్రీ పంచముఖ నరసింహ స్వామి దేవాలయం ఉంది.అతి పురాతనమైన ఈ పంచముఖ నరసింహ ఆలయాన్ని నంద రాజు అనే మహా రాజు నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

ఈ ఆలయం పైకప్పు భాగం బండపై 16 చేతులు కలిగినటువంటి నరసింహ స్వామి విగ్రహం మనకు కనబడుతుంది.పదహారు చేతులలో వివిధ రకాల ఆయుధాలను పట్టుకొని హిరణ్యకశిపుడిని అంతమొందించే రూపంలో ఉన్నటువంటి ఉగ్ర నరసింహుడు ఇక్కడ దర్శనమిస్తాడు.

Advertisement
Everything About The Unique Panchamukha, Panchamuka Narasimha Swamy, Telangana,

సాధారణంగా పంచముఖ నరసింహ స్వామికి 10 చేతులే ఉండాలి.కానీ ఈ ఆలయంలో మాత్రం 16 చేతులు కనిపించడం విశేషం.

Everything About The Unique Panchamukha, Panchamuka Narasimha Swamy, Telangana,

ఈ ఆలయంలో స్వామివారిని భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే దేవుడిగా భావిస్తారు.తమ కోరికలు తీరిన భక్తులు స్వామివారికి కానుకగా వెండి ఆభరణాలతో తయారుచేసిన వెండి నామాలను, వెండి మీసాలను స్వామివారికి కానుకలుగా సమర్పిస్తుంటారు.ప్రతి ఏటా ఈ ఆలయంలో స్వామి వారికి ఉత్సవాలు ఎంతో వేడుకగా జరుగుతాయి.

ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని స్వామి వారిని దర్శించుకుంటారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు