బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులుగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కియారా అద్వానీ, సిద్ధార్థ మల్హోత్రా గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట తమ ప్రేమ ప్రయాణానికి ముగింపు పలుకుతూ పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
ఇలా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కియారా సందడి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఓ అవార్డు వేడుకలో భాగంగా ఈ కొత్త జంట తలుక్కుమన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా లవ్ మ్యారేజ్ గురించి కియారా అద్వానీ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఇద్దరు వ్యక్తులు ప్రేమికులుగా ఉండడం ఎంతో బాగుంటుందో ఆ ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్తే ఆ సంతోషమే వేరు అంటూ ఈమె తెలియజేశారు.
ఇక తను తన పెళ్లి వేడుకలలో చాలా బాబోద్వేగానికి గురయ్యానని ఈ సందర్భంగా కియారా వెల్లడించారు.
పెళ్లి మండపానికి చేరుకున్న తర్వాత పెళ్లి పీటలపై సిద్దార్థ్ మల్హోత్రాను చూడగానే మనసంతా ఏదో పులకించిందని, ఆ ఫీలింగ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఉంటుందని ఈ సందర్భంగా లవ్ మ్యారేజ్ గురించి ఈ కొత్త పెళ్లికూతురు చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక పెళ్లి తర్వాత ఈ జంట వారి సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.ఇక కియార అద్వానీ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy