తెలంగాణ లో ఎన్నికలు(Telangana Elections) ప్రశాంతంగా ముగిశాయి.ఎన్నికలు అయితే ముగిసాయి కాని డిసెంబర్ 3న ఫలితాలు ఎలా ఉంటాయో అని అధికారులు టెన్షన్ పడుతున్నారు.
అయితే ఇప్పటివరకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ (Congress) కే అనుకూలంగా చెప్పాయి.ఏవో కొన్ని సర్వేలు తప్ప మిగతావన్నీ కాంగ్రెస్ కే 50 నుండి 55 సీట్లు వస్తాయని అంచనా వేశాయి.
అయితే ఈసారి బీఆర్ఎస్ కి ( BRS ) గట్టి షాక్ పడబోతుందని తెలుస్తోంది.అంతేకాకుండా రేవంత్ రెడ్డి సైతం ఫలితాలు రాకుండానే పోటీ చేసిన నాయకులు అందరూ పండగ చేసుకోవచ్చు అంటూ ఒక శుభవార్త చెప్పారు.
అయినప్పటికీ నేతల్లో మాత్రం ఒక రకమైన గుబులు ఉండే ఉంటుంది.
అయితే ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గట్టి బుద్ధి చెప్పారు అని అనుకుంటున్నప్పటికీ మెజార్టీ సీట్లు రాకపోయినా అధికారం బీఆర్ఎస్ దే అంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారట.
అయితే ఇప్పటికే వెలవడిన కొన్ని ఎగ్జిట్ పోల్స్ లలో( Exit Polls ) బిజెపికి కనీసం మూడు స్థానాలు కూడా రాలేదు.కానీ ఈ సర్వేలపై బిజెపి (BJP) పార్టీ మాత్రం కచ్చితంగా మేం సీట్లు గెలుస్తాం కింగ్ మేకర్ మేమే అవుతాం అని చెప్పుకుంటున్నారు.
అలాగే ఎంఐఎం( MIM ) సైతం ఇలాగే చెప్పుకొస్తున్నారు.ఇక ఇప్పటికే బీఆర్ఎస్ తో ఎంఐఎం కి మంచి దోస్తానా ఉంది.

ఒకవేళ పార్టీ ఏర్పాటు చేయడానికి కావలసినన్ని సీట్లు రాకపోయినా కూడా ఎంఐఎం (MIM) సపోర్ట్ చేస్తుంది.అలాగే బిజెపి కూడా వాళ్లు గెలిచిన రెండో మూడో సీట్లను బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చేస్తుంది.అలా మెజార్టీ సీట్లు రాకపోయినా కూడా బీఆర్ఎస్ కే అధికారం వస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.అలాగే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ లో గెలుపు గుర్రాలు ఉన్నారని వాళ్లు ఫలితాలు వెలువడిన నెక్స్ట్ మినిట్ బి ఆర్ ఎస్ లోకి జంప్ అవుతారు అనే వాదన ఇప్పటికే ఉంది.
ఎందుకంటే గతంలో కాంగ్రెస్ లో గెలిచిన చాలామంది నాయకులు బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు.

ఇక ఈసారి కూడా అలాగే జరుగుతుందని భావిస్తున్నారు.ఇక ఈ భయంతోనే కాంగ్రెస్ అధినాయకత్వం పోటీ చేసిన అభ్యర్థులందరిని బెంగళూరుకి( Bangalore ) కదిలించాలనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.అయితే ఈసారి ప్రజలు మార్పు రావాలి అని ఒకే ఒక్క ఉద్దేశంతో కాంగ్రెస్ (Congress) కి ఓట్లు వేశారని వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఫలితాలు వెలువడితే తప్పా ఊపిరి పీల్చుకోలేరు నాయకులు.
మరి చూడాలి డిసెంబర్ 3న ఫలితాలు ఎలా ఉంటాయో.