నేను మరణించైనా కాపు రిజర్వేషన్లు సాధిస్తా : మాజీ ఎంపీ హరిరామజోగయ్య

కాపు రిజర్వేషన్ల సాధనకు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం నిరాహార దీక్ష చేపడతానని మాజీ ఎంపీ హరిరామజోగయ్య వెల్లడించారు.తాను మరణించైనా కాపులకు రిజర్వేషన్లు సాధిస్తానని మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామజోగయ్య అన్నారు.

 Even If I Die, I Will Get Kapu Reservations: Former Mp Harirama Jogaiah , Harira-TeluguStop.com

కాపులకు 5% రిజర్వేషన్ కల్పించే విషయంలో డిసెంబర్ 31లోపు స్పష్టత ఇవ్వాలని ఇటీవల ఏపీ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.ఆ గడువు ముగిసిన నేపథ్యంలో హరిరామజోగయ్య ఓ ప్రకటన విడుదల చేశారు.

కాపు రిజర్వేషన్ల సాధనకు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం నిరాహార దీక్ష చేపడతానని హరిరామ జోగయ్య వెల్లడించారు.నిరాహారదీక్షకు అనుమతి కోరితే పోలీసులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.

తాను చేపట్టే దీక్షను భగ్నం చేసినా.ఎక్కడికి తరలిస్తే అక్కడ కొనసాగిస్తానని ఆయన తేల్చి చెప్పారు.

కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం నుంచి స్పందన రానందునే నిరాహారదీక్షకు దిగుతున్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube