తెలంగాణ సీఎంగా ఈటెల‌... కేసీఆర్ ఫ్యామిలీకి టోట‌ల్ చెక్ ?

తెలంగాణ సీఎంగా త్వ‌ర‌లోనే కేటీఆర్ బాధ్య‌త‌లు చేప‌డుతున్నార‌న్న ప్ర‌చారం కొద్ది రోజులుగా న‌డుస్తోంది.

ఆ మాట‌కు వ‌స్తే టీఆర్ఎస్ నేత‌లు, ఎమ్మెల్యేలు, మంత్రులే ఈ విష‌యాన్ని ఓపెన్‌గా చెప్పేస్తున్నారు.

కేసీఆర్ సైతం జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లే క్ర‌మంలో ఇక్క‌డ బాధ్య‌త‌లు వార‌సుడికి ఇచ్చేస్తార‌న్న టాక్ కూడా ఉంది.అయితే ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీకే చెక్ పెట్టేలా తెలంగాణ రాజ‌కీయంగా కొత్త చ‌ర్చ స్టార్ట్ అయ్యింది.

ఉద్య‌మంతో ఏర్పాటు చేసుకున్న తెలంగాణ‌లో వార‌స‌త్వ రాజ‌కీయాలు కాకుండా.టీఆర్ఎస్‌లోనే అన్నింటికి స‌మ‌ర్థుడు అయిన మంత్రి ఈటెల రాజేంద‌ర్‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

టీఆర్ఎస్‌లో ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోసం స‌మ‌ర్థుడైన ఈటెల ఉన్న‌ప్పుడు కేటీఆర్ ఎందుకు అంటూ ఉద్య‌మ నేత చెఱుకు సుధాక‌ర్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి వంటి నేత‌లు బ‌హిరంగంగా వ్యాఖ్యానించారు.పైగా ఈట‌ల అంటే తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీ వాళ్ల‌కు కూడా అంత టార్గెట్‌గా ఉండ‌రు.

Advertisement
Etela Rajender As Telangana CM Total Check For KCR Family, Etela,kcr,ktr,kavitha

ఆయ‌న మృదు స్వ‌భావి అన్న పేరుంది.అందులోనూ బీసీ నేత‌.

అందుకే ప్ర‌తిప‌క్షాలు వ్యూహాత్మ‌కంగా ఈటెల‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌న్న కొత్త డిమాండ్‌ను తెర‌మీద‌కు తేవ‌డం ద్వారా టోట‌ల్ కేసీఆర్ ఫ్యామిలీకే చెక్ పెట్టేసిన‌ట్లయ్యింది.

Etela Rajender As Telangana Cm Total Check For Kcr Family, Etela,kcr,ktr,kavitha

ఇందులోనూ ఓ రాజ‌కీయం ఉంది.ఇటీవ‌ల ఈటెల కేసీఆర్‌పై తిరుగుబావుటా ధోర‌ణితో మాట్లాడుతున్నారు.అందుకే ఆయ‌న పేరు తెర‌మీద‌కు తేవ‌డం ద్వారా కేసీఆర్, కేటీఆర్‌ల‌ను ఇర‌కాటంలోకి నెట్ట‌వ‌చ్చ‌న్న‌దే వీరి ప్లాన్‌.

ఇక టీఆర్ఎస్‌లో అస‌మ్మ‌తి వాదుల‌కు కూడా ఈ డిమాండ్ బాగా న‌చ్చేస్తోంద‌ట‌.

Advertisement

తాజా వార్తలు