జనసేనలో చేరాలంటే ప్రవేశ పరీక్ష రాయాలంట

ప్రవేశ పరీక్షలు మనకు కొత్తేమి కాదు.ఇంజనీరింగ్ లో చేయాలనుకుంటే ఎంసెట్ రాస్తాం, ఎమ్బిఏ చేయాలనుకుంటే ఐసెట్ రాస్తాం .

ఇలా చాలా కోర్సులకి చాలారకాల పరీక్షలు ఉన్నాయి.పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా ఫైనల్ ఇంటర్వ్యూకి ముందు రాత పరీక్ష పెడతారు.

కాని ఓ రాజకీయపార్టిలో చేరాలంటే పరీక్ష రాయాలనే తంతుని ఎక్కడైనా చూసారా ? ఈ కొత్త సిస్టం ని తీసుకొస్తున్నారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.జనసేనలో సభ్యత్వం కావాలంటే అర్థత కోసం ఓ రాతపరీక్ష రాయాల్సిందే అంట.ఈ రాత పరీక్షలో ఏం రాయమంటారో, ఎలాంటి ప్రశ్నలు వదులుతారో తెలియదు కాని ఇప్పటికే 3600 దరఖాస్తులు వచ్చాయట.ఏప్రిల్ 21 నుంచే మొదలయ్యే ఈ అర్హత పరీక్షలు మూడురోజులపాటు కొనసాగుతాయి.

పరీక్ష వేదిక జీఆర్ గార్డెన్స్‌, గొంగ‌డి రామ‌ప్ప కాంపౌండ్‌, 3వ రోడ్డు ఎక్స్‌టెన్ష‌న్‌, ఈస్ట్ గేట్, అనంత‌పురం.ఎవరి పరీక్ష ఎప్పుడు, ఏ సమయంలో, ఏ రోజు ఉంటుంది అనే విషయాన్ని అభ్యర్తులకి ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు.

Advertisement

మరి ఇంకా ఆలస్యం ఎందుకు పవర్ స్టార్ ఫ్యాన్స్ ? మీరు జనసేనలో ఓ భాగం కావాలనుకుంటే వెంటనే దరఖాస్తు పెట్టుకోండి.పరీక్షకి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.

ఎమ్మెల్యే కురసాల కన్నబాబుపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

Advertisement

తాజా వార్తలు