ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న ఇంగ్లాండ్ అండర్ -19 క్రికెట్ బృందం..

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ: ఈరోజు ఇంగ్లాండ్ యొక్క అండర్ -19 క్రికెట్ బృందం 19 మంది శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ పాలకమండలి వారు, ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు.

అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా పాలకమండలి సభ్యులు మరియు ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టుబోర్డ్ సభ్యులు బుద్ధా రాంబాబు, కట్టా సత్తయ్య, కేసరి నాగమణి, సహాయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు