ఆఫ్ స్క్రీన్‌లో కూడా కుమ్మేస్తున్నాడు.. రోహిణితో ఇమాన్యుయేల్ ఆటలు

ఈటీవీలో గత కొంత కాలం నుండి మంచి ఆదరణతో ప్రసారమవుతున్న జబర్దస్త్ గురించి అందరికీ తెలిసిందే.

అందులో పాల్గొనే కంటెస్టెంట్ లు కూడా తమకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంటున్నారు.

వెండితెర లో కూడా మెరుస్తున్నారు జబర్దస్త్ కమెడియన్లు.కేవలం జబర్దస్త్ వేదిక నుండి ఎంతో వరకు దూసుకుపోతున్నారు.

పైగా ఒక్క షోతో కాకుండా మరిన్ని షో లలో కూడా జబర్దస్త్ కమెడియన్ ల హవా నడుస్తుంది.ఇక ఇందులో అతి తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించుకున్న ఇమాన్యుయేల్ కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.

బిగ్ బాస్ కోసం జబర్దస్త్ లో వదిలివెళ్లిన ముక్కు అవినాష్ స్థానంలో మరో కమెడియన్ ఇమాన్యుల్ వచ్చిన సంగతి తెలిసిందే.ఈ షోలో ఆయన కెవ్వు కార్తీక్ టీం లో కీలక పాత్రలో నటించాడు.

Advertisement

అలా మరికొన్ని టీమ్ లలో కూడా చేస్తున్నాడు ఇమాన్యుయేల్.పైగా మంచి మార్కులు కూడా కొడుతున్నాడు.

గతంలో సుడిగాలి సుధీర్ కే పోటీ గా వచ్చాడు ఇమాన్యుయేల్.కేవలం జబర్దస్త్ లోనే కాకుండా ఈటీవీ ప్లస్ లో ప్రతి ఆదివారం ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా చేస్తున్నాడు.

నిజానికి జబర్దస్త్ లో ఆయన అంతగా గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం మరో బుల్లితెర ఆర్టిస్ట్ వర్ష అని చెప్పాలి.వర్ష తో కలిసి బాగా పర్ఫామెన్స్ చేస్తుంటాడు.వీరిద్దరి కాంబినేషన్ వల్లే ఆ టీమ్ కు మంచి విజయం అందింది.

అంతేకాకుండా వీరి మధ్య జరిగే సన్నివేశాలు కూడా వీరు గానీ ప్రేమలో ఉన్నారా అన్నట్లు అనిపిస్తుంది.అంతేకాకుండా షో బయట కూడా ఈ జంట బాగా సన్నిహితంగా ఉంటుంది.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

ఇక గతంలో వీరి మధ్య సన్నివేశాలు బాగా అతి గా ఉన్నాయని ప్రేక్షకులనుండి కామెంట్లు కూడా ఎదురయ్యాయి.ఇప్పటికి కూడా వీరికి కామెంట్లు ఎదురవుతూ ఉంటాయి.అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తమకు నచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు.

Advertisement

ఇక ఇదంతా పక్కన పెడితే ఇమాన్యుయేల్ అల్లరి ఆన్ స్క్రీన్ మీదనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా బాగా సందడిగా ఉంటుంది.ఇతర ఆర్టిస్టులతో కలిసి బాగా రచ్చరచ్చ చేస్తుంటాడు.నిజానికి ఆయన వేదిక పైనే కాకుండా బయట కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు.

ఇదిలా ఉంటే తాజాగా మరో ఆర్టిస్ట్ రోహిణి తో కలిసి ఆటలు ఆడుతూ కనిపించాడు.

తమకు సంబంధించిన వీడియోను ఇన్ స్టా ఖాతాలో పంచుకోగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.అందులో ఇమాన్యుయల్, రోహిణి ఆన్లైన్ గేమ్ ఆడుతున్నట్లు కనిపించగా.ఇమాన్యుయల్ తన ఆటతో కుమ్మేస్తున్నాడు.

అక్కడ కూడా తానే గెలిచే విధంగా కనిపించాడు.ప్రస్తుతం ఈ వీడియో తమ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.

అంతేకాకుండా బాగా ఆడుతున్నారు అంటూ తెగ కామెంట్లు కూడా వస్తున్నాయి.

తాజా వార్తలు