అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారాల కూతురు ఇవాంకా ట్రంప్ వివాదంలో చిక్కుకుంది.తండ్రి తరువాత ఆ రేంజ్ లో చక్రం తిప్పుతున్న ఆమె ఎన్నో దేశాలు పర్యటనలు చేసి మాంచి మార్కులే కొట్టేసింది…తన తండ్రికి వ్యక్తిగతంగా సలహాలని ఇవ్వడమే కాకుండా.
వైట్‌హౌజ్ టాప్ సలహాదారుగా కూడా ఇవాంకా పనిచేస్తోంది.ఇదిలాఉంటే
ఇవంకా గత ఏడాది తన వ్యక్తిగత ఖాతా నుంచి వందలాది ఇ- మెయిళ్లు పంపినట్లు వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో పేర్కొంది.పబ్లిక్ రికార్డుల నిబంధనలు ఉల్లంఘించిన వైట్‌హౌజ్ సహాయకులు, కేబినెట్ సభ్యులు, తన సహాయకులకు ఆమె ఇమెయిళ్లను పంపినట్లు పేర్కొంది…అయితే ఈ కధనం వెలువడిన తరువాత కూడా ఈ ఇ మెయిళ్ల వినియోగం పై వైట్‌హౌజ్ నుంచి స్పందన రాలేదు.అయితే ఈ విషయాన్ని వివాదాస్పదం చేయకండి అంటూ ఆమె న్యాయవాద, ప్రతినిధి అబ్బె లోవెల్ పేర్కొన్నారు.
ప్రభుత్వ సమాచారాన్ని మార్పు చేసేటప్పుడు మిస్ ట్రంప్ కొన్నిసార్లు తన వ్యక్తిగత ఖాతాను వినియోగించినట్టు ప్రతినిధి పీటర్ మిర్‌జానియన్ తెలిపారు తప్ప ఆ మైళ్ళలో సందేశాలలో వర్గీకృత సమాచారం పంపలేదని ఆయన తేల్చి చెప్పారు.అయితే ఈ అంశానికి సంబంధించి కొన్ని నెలల క్రితం పత్రికల్లో వచ్చినపుడు వైట్‌హౌజ్ కౌన్సిల్‌తో కలిసి తన ఇ -మెయిళ్లను ఆమె పరిశీలించారని ఆ సమస్యని కాంగ్రెస్ నేతలకు వివరించినట్లు ఆయన మీడియాకి తెలిపారు.