మాకూ మానవత్వం ఉందంటున్న ఏనుగులు.. ప్రశంసిస్తున్న నెటిజన్లు!

మానవత్వం మనుషులలోనే కాదు, జంతువులలోను అప్పుడప్పుడు బయటపడుతుంది.అసలు ఆ మాటకొస్తే మానవత్వం అనేది మనలో నశించిందనే చెప్పుకోవాలి.

 Elephants Who Say We Have Humanity , Elephant , Helping ,viral Latest , News Vir-TeluguStop.com

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరి జీవితం వాడు గడుపుతున్నాడు.ఇంకా పక్కవాళ్లను పట్టించుకొనే సమయం ఎక్కడుంది? మనిషి ఎంతలాగ దిగజారిపోయాడంటే, పక్కవాడు ఎక్కడ సహాయం అడుగుతామో అని .ముందే ముఖం చాటేసుకుంటారు.అయితే కొంత మంది వీరికి భిన్నంగా ఉంటారనుకోండి.

ఇకపోతే కొన్ని సందర్భాలలో మనుషుల కన్నా నోరులేని మూగ జీవాలనే నయం అనిపిస్తుంటుది.

వాటికి కొంచెం అన్నం పెట్టినా అవి ఎంతో విశ్వాసంగా ఉంటాయి.

వాటికి ఉదాహరణ విధి కుక్కలని చెప్పుకోవచ్చు.ఆపదలో ఉన్న యజమాని కోసం ప్రాణాలను సైతం అవి లెక్కచేయవు.

ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.అయితే ఇక్కడ పాత్ర కుక్కడి కాదు.ఏనుగుది.అవును… ఇక్కడున్న ఏనుగుని ఓసారి చూస్తే, నది ఉధృతంగా ప్రవహిస్తుంది.నది పక్కన ఒక ఏనుగుల గుంపుని గమనించవచ్చు.అయితే.ఆ నదీ ప్రవాహంలో ఒక వ్యక్తి కొట్టుకొని పోతున్నాడు.ఇంతలో అక్కడున్న ఓ ఏనుగు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి అతడిని కాపాడే ప్రయత్నం చేస్తోంది.

అంతటి ప్రవాహాన్ని కూడా ఏనుగు ఏమాత్రం లెక్క చేయకుండా.నదిలో వెళ్లి అతడు కొట్టుకుని పోకుండా తన తొండం ఆ మనిషికి అందివ్వడంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు.అతను కాసేపు ఏనుగు ఆధారంతో నిలబడ్డాడు.ఆ తర్వాత.అతడిని ఏనుగు ఒడ్డువైపు వెళ్లేలా ఆధారాన్నిచ్చింది.ఇక ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు గాని, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

దీన్ని చూసిన నెటిజన్లు.కొంత మంది మనుషుల కన్నా.

నోరులేని జీవాలే నయం అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube