Elephants Music: మ్యూజిక్‌ వింటూ మైమరిచి పోతున్న ఏనుగులు.. వీడియో వైరల్..

అతి పెద్ద శరీరంతో ఏనుగు ఘీంకరిస్తే ఎలాంటి జంతువులైనా బెదిరి పోతాయి.మదమెక్కిన ఏనుగు ముందు సింహాలు కూడా వెనకడుగు వేస్తాయి.

అయితే తెలివైన జంతువులుగా అవి పేరొందాయి.మచ్చిక చేసుకుంటే మనుషులకు తగ్గట్టు నడుచుకుంటాయి.

ఇదే కోవలో తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు పియానో ​​సంగీతాన్ని ఆస్వాదిస్తున్న చక్కటి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.పచ్చటి వాతావరణం మధ్య ఒక వ్యక్తి ఓపెన్ ఎయిర్ లొకేషన్‌లో పియానో ​​వాయిస్తుండగా, తల్లి ఏనుగు- పిల్లఏనుగు సంగీతాన్ని వింటూ ఎంజాయ్ చేస్తున్నాయి.ఆ వ్యక్తి సాదన చేసే సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాయి.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.ఏనుగులు తెలివైన జంతువులుగా పేరొందాయి.

Advertisement

జూలలో మచ్చిక అయిన జంతువులు జూ కీపర్లతో సరదాగా ఆడుకున్న వీడియోలు బాగా అలరిస్తున్నాయి.ఇదే కోవలో రెండు ఏనుగులు సంగీతం ఆస్వాదిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ఇటీవల ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.తక్కువ వ్యవధిలో, ప్రస్తుతం దీనికి అధికంగా లైకులు వస్తున్నాయి.

ఆమె ఈ వీడియోకు "తల్లి మరియు పిల్ల ఏనుగు వీడియో కోసం పియానో ​​- పాల్ బార్టన్ థాయిలాండ్" అని క్యాప్షన్ ఇచ్చింది.వీడియో చివరలో దానికి "పియానో ​​ఫర్ ఎలిఫెంట్స్" అని పేరు పెట్టారు.

ఇది థాయిలాండ్‌లో జరిగిందని తెలుస్తోంది.ఈ వీడియో 2019 నాటిది.నార్పోల్, తల్లి, బేబీ నార్గెల్ ఉన్నారు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్

పియానిస్ట్ పాల్ బార్టన్.ఈ వీడియో థాయ్‌లాండ్‌కు చెందినది.

Advertisement

అప్పటి వీడియోను తాజాగా పోస్ట్ చేసినా, దానికి విశేష స్పందన వస్తోంది.ఏనుగులకు కూడా సంగీత స్పృహ ఉండడం తమను ఆశ్చర్యపరుస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు